Prabhas: ప్రభాస్ పక్కన ఆ హీరోయిన్నే ఎందుకు తీసుకున్నారో చెప్పిన హను రాఘవపూడి..

ఇప్పుడు ఇదే ఉత్సాహంతో ఆయ‌న సినిమాల్లో న‌టించేందుకు రెడీ అవుతున్నారు.

Update: 2024-08-22 12:28 GMT

దిశ, సినిమా: ‘సలార్‌’, ‘కల్కి 2898 AD’ సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వడంతో ప్ర‌భాస్‌ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో ఆయ‌న సినిమాల్లో న‌టించేందుకు రెడీ అవుతున్నారు. సీతా రామం ఫేమ్ హ‌ను రాఘ‌వ‌పూడి డైరెక్షన్లో తెర‌కెక్క‌నున్న మూవీ కూడా ఒక‌టి. ఇది పూర్తి యాక్షన్‌ సినిమాగా మన ముందుకు రానుంది.

ఈ మూవీకి ‘ఫౌజీ’ అనే టైటిల్‌ పెట్టబోతున్నారని తెలిసిన సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీలో ప్ర‌భాస్ స‌ర‌స‌న సోషల్‌ మీడియా స్టార్‌ ఇమాన్వీ ఎస్మాయిల్‌ను సెలెక్ట్ చేసినట్లు మనకి తెలిసిందే.

గొప్ప స్టార్ హీరోయిన్ల‌ను కూడా వద్దని ఈమెకి ఛాన్స్ ఇవ్వడం వెనుక రక రకాల వార్తలు వస్తున్నాయి. తాజాగా, వీటిపై ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి స్పందించారు. " ఎవరి ఏ టాలెంట్ ఉందో ఈ రోజుల్లో చాలా ఈజీగా తెలుసుకోవచ్చు.. అలాంటి వాటిని బయటపెట్టడంలో సోష‌ల్ మీడియా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మేము కూడా మా కథకి కావాల్సిన న‌టీన‌టుల‌ను సోషల్ మీడియా నుంచే ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నాము. అలా వెతుకున్న సమయంలో ఇమాన్వీ గురించి తెలిసింది ఆమె కళ్లతోనే ఎన్నో హావభావాలను పలికిస్తుంది. అలా ఆమెను ఆడిషన్స్‌, స్క్రీన్‌ టెస్ట్ తర్వాత ఒకే చేశామని" ఆయన తెలిపారు.

Tags:    

Similar News