అది గిఫ్ట్‌గా ఇచ్చి నన్ను మీ సొంతం చేసుకోండి.. అనుపమ పరమేశ్వరన్ సంచలన పోస్ట్!

యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కేరళ కుట్టి అయినప్పటికీ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలు హిట్ చిత్రాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

Update: 2024-02-28 02:23 GMT

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కేరళ కుట్టి అయినప్పటికీ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలు హిట్ చిత్రాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డతో టిల్లు స్వ్కేర్‌లో నటిస్తుంది. ఈ సినిమాలో అనుపమ ఎన్నడూ లేని విధంగా బోల్డ్, రోమాంటిక్ సీన్స్‌తో రెచ్చిపోయింది.

ఇటీవల విడుదలైన టీజర్‌లో అనుపమ, సిద్దు మధ్య ఉన్న సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే అందులోని ముద్దు సీన్స్ షాక్‌‌కు గురిచేశాయి. అలాంటి సీన్స్‌లో ఆమెను ఊహించుకోలేమంటూ అనుపమ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా ఆవేదన కూడా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేరళ కుట్టికి షూటింగ్ గ్యాప్ దొరకడంతో వెకేషన్స్‌కు వెళ్లి ఎంజాయ్ చేస్తుంది. అంతేకాకుండా ఆ ఫొటోలు, వీడియోలను నెట్టింట షేర్ చేసి రచ్చ చేస్తుంది.

తాజాగా, అనుపమ ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. తనకు ఓ జంతువును గిఫ్ట్‌గా ఇచ్చి తనను సొంతం చేసుకోమంటూ అబ్బాయిలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ‘‘ దీనిని నాకు గిఫ్ట్‌గా తీసుకురండి బాయ్స్. నేను మీ సొంతం’’ అంటూ రాసుకొచ్చింది. అసలు విషయం ఏంటంటే.. నీటి ఏనుగుగా చెప్పబడే హిప్పోపొటామస్ పిల్ల వీడియోను షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు పదండి బాయ్స్ అలర్ట్ అవండి హిప్పోని గిఫ్ట్‌గా ఇచ్చి అనుపమను సొంతం చేసుకుందాం అంటూ ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు పోస్ట్ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.



 

Full View


Similar News