Guppedantha Manasu : మను, అనుపమల సంబంధం బయటపడనుందా?

గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

Update: 2024-03-20 06:28 GMT
Guppedantha Manasu : మను, అనుపమల సంబంధం బయటపడనుందా?
  • whatsapp icon

దిశ, సినిమా : గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

ఇంతలో బాధలో ఉన్న మను దగ్గరకు వెళ్లి.. ‘మనూ’ అని పిలుస్తాడు మహేంద్ర. దాంతో మను.. ‘సార్’ అంటూ మహేంద్రను పట్టుకుని ఏడుస్తాడు. ‘సార్.. మేడమ్.. మేడమ్‌కి అంటూ చాలా ఎమోషనల్ అవుతాడు మను. మేడమ్ ఏమి కాదు మను.. నువ్వు కంగారు పడకు.. అని అంటాడు మహేంద్ర. ‘లేదు సార్..నాకు చాలా భయంగా ఉంది. నా కాళ్లూ చేతులూ పని చేయడం లేదు.. నా గుండె బరువెక్కినట్టు ఉందని ’ అని అంటాడు మను. నువ్వు అధైర్య పడకు మను.. ప్లీజ్’ అని కూల్ చేస్తాడు మహేంద్ర.

ఇంతలో నర్స్ వచ్చి.. ‘సార్ ఎన్ఓసీ ఫామ్‌పై సంతకం చేయండి’ అని పిలవగానే.. మను కంగారు పడుతూ.. ఆ ఫామ్‌పై సంతకం చేస్తాడు. ‘సిస్టర్ మేడమ్‌కి ఎలా ఉంది? బాగానే ఉన్నారు కదా.. మేడమ్‌కి ఏం కాదు కదా ? అని కంగారుగా అడుగుతాడు. ‘సార్.. మీకు అసలు టెన్షన్ పడకండి.. ట్రీట్ మెంట్ జరుగుతుంది’ అని అంటుంది. నర్స్ ఫామ్ తేవడం.. దానిపై సంతకం పెట్టాడంటే.. ఇక్కడే అందరికి డైరెక్టర్ క్లూ ఇచ్చేసాడు. ఆ ఫామ్‌పై ఖచ్చితంగా రిలేషన్ రాయాలి కాబట్టి.. అక్కడ సన్ అని సంతకం పెట్టె ఉంటాడు. ఇప్పుడు మను, అనుపమ సంబంధం గురించి మహేంద్ర, వసుధార కి తెలిసిపోతుంది. 

Tags:    

Similar News