Guppedantha Manasu : మను కన్న తండ్రి అతనా.. సూపర్ ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్
మను కన్న తండ్రి అతనా..
దిశ, సినిమా: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
మనును జైలు నుంచి ఎలా అయిన విడిపిస్తాను.. ఆ బాధ్యత నాది అంటూ అని అనుపమకు మాటిస్తాడు మహేంద్ర. అతను ఎలాంటి వాడో నాకు తెలుసు. తనది అలాంటి మనస్తత్వం కాదని, తన గురించి తెలుసునని అనుపమతో అంటాడు. అక్కడే ఉన్న పెద్దమ్మ.. కావాలని మాటలు అంటుంది.. అయినా , నీది, మనుది ఎలాంటి బంధమో నీకు తెలీదా అని అని మహేంద్రతో అంటుంది. ఇన్‌డైరెక్ట్‌గా మను నీ కన్న కొడుకే అని చెబుతుంది పెద్దమ్మ. కానీ ఆమె మాటలను పక్కకు పెడతాడు. పెద్దమ్మ నిజం ఎక్కడ చెప్పిస్తుందేమో అని వసుధార, అనుపమ భయ పడతారు.
తండ్రి ఎవరో తెలియక మను తన తండ్రి పై కోపం పెంచుకుంటాడు. ఈ పరిస్థితుల్లో మహేంద్ర గురించి తెలిస్తే మను అతడిని చంపడానికి కూడా వెనుకాడడని అనుపమ భయపడుతుంది. తన తండ్రిపై ఉన్న కోపం పోయేవరకు ఈ విషయం తెలియకూడదని మనసులో అనుకుంటుంది.
కట్ చేస్తే .. ఎండీ సీట్ ప్రతి సారి మను అడ్డు పడుతున్నాడని బాగా ఆలోచించి రాజీవ్ మర్డర్ కేసులో మనుని ఇరికించి జైలుకి పంపిస్తాడు. రాజీవ్ బతికే ఉన్నాడని, ఈ శైలేంద్ర అతన్ని ఎక్కడో దాచిపెట్టి ఉంటాడని అందరూ అనుకుంటారు. నిజంగానే వారు రాజీవ్ బతికే ఉన్నాడా? శైలేంద్ర, రాజీవ్ ని దాచి పెట్టాల్సిన అవసరం ఎంటనేది తెలియాల్సి ఉంది. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.