Guppedantha Manasu : దేవ‌యానిపై విరుచుకుపడ్డ ఫ‌ణీంద్ర‌

గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

Update: 2024-05-03 07:01 GMT

దిశ, సినిమా: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

వ‌సుధార‌ తెలివిగా దేవ‌యాని, అనుప‌మ‌తో మాట్లాడిన మాటలన్ని రికార్డ్ చేస్తుంది వ‌సుధార‌. ఈ వీడియోను ఫ‌ణీంద్ర‌కు పంపిస్తుంది. ఆ వీడియో చూసిన ఫ‌ణీంద్ర‌ దేవ‌యానిపై ఎన్నడూ లేని విధంగా ర‌గిలిపోతాడు. దేవ‌యాని చేసిన త‌ప్పుకు తన కొడుకు శైలేంద్ర చెంప‌పై కొడ‌తాడు. మమ్మీ చేసిన త‌ప్పుకు తనని కొట్టడం చూసి శైలేంద్ర షాక‌వుతాడు. అయినా న‌న్ను ఎందుకు కొట్టారని అడుగుతాడు. మీ అమ్మ‌ను కొట్ట‌లేను కాబ‌ట్టి, అసలు చేసేది మొత్తం నువ్వే కదా ఫ‌ణీంద్ర‌.. నువ్వు వచ్చాకే నా భార్య చాలా మారిపోయింది.

నిన్ను కొడితే ఆమెకి బుద్ది వస్తుంది. నువ్వు ఏది చెప్తే దానికి సై అంటుంది మీ అమ్మ. మీ మమ్మీ చెప్పిన దానికి నువ్వు కూడా ఒకే అంటావు త‌ల్లికి త‌గ్గ కొడుకు..కొడుకుకు త‌గ్గ త‌ల్లి అంటూ ఇద్ద‌రికి ఒక రేంజ్లో వేసుకుంటాడు. మీరు చేసే తప్పులు తెలియ‌వు.

క‌నీసం ఎదుటివాళ్లు దాన్ని అర్ధం చేసుకోవడం కూడా రాదు. నేను కోపంగా ఏదైనా చెబితే మారిపోయిన‌ట్లు న‌టిస్తారు. ఆ త‌ర్వాత మీకు మీరే మాట్లాడుకుని అన్ని చెబుతారంటూ ఇద్ద‌రిపై కోప‌గించుకుంటాడు. ఇంకోసారి కాలేజీ వ్య‌వ‌హారాల్లో మీరు దూరకండి అంటూ దేవ‌యానికి వార్నింగ్ ఇస్తాడు ఫ‌ణీంద్ర‌.


Similar News