Guppedantha Manasu: రిషి గుండెలపై వసుధార.. రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిన ప్రేమ పక్షులు
గుండెలపై వాలిపోయి.. రిషిని కౌగిలించుకుంటుంది.
దిశ,వెబ్ డెస్క్: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
జరిగిన అవమానం చూసి వసుధారకు ఆల్ ది బెస్ట్ చెప్పేసి దేవయాని, శైలేంద్రలు అక్కడి నుంచి జారుకుంటారు. అప్పుడు వసు.. రిషితో.. ‘సార్ మీరు నిజంగానే మనస్పూర్తిగా నన్ను ఈ ఎండీ సీట్‌లో కూర్చోబెట్టారా?’ అని వసు అడుగుతుంది. ఎందుకు అలా అడుగుతున్నావ్.. ‘నా గుండెల మీద చేయి పెట్టుకుని చెబుతున్నాను ..నిన్ను మనస్పూర్తిగా కూర్చొబెట్టాను..దీనిలో ఎలాంటి ఉద్దేశం లేదు.. నువ్వు ఈ పోస్టుకు అర్హురాలివి వసుధార అని అంటాడు. ఇప్పుడెందుకు ఇలాంటి డౌట్ వచ్చింది. అంటాడు రిషి. ‘మరేం లేదు సార్.. ఇంతకుముందు కూడా నన్ను ఇలానే కూర్చోబెట్టారు.. నా చేయి వదిలిపెట్టను అన్నారు. కానీ వెళ్లిపోయారు’ అంటుంది వసు బాధగా.
అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు వేరు. ఇక నేను నీ చేయి వదిలిపెట్టను. నువ్వు చెప్పింది .. ప్రతీది వింటాను. ఆలోచిస్తాను. నిన్ను బాధపెట్టను. నువ్వు ఏదైనా విషయం దాచిపెట్టావంటే అది నా మంచి కోసమే అని అర్థం చేసుకుంటాను.. అంటూ చేతిలో చేయి వేసి మరీ రిషి చెబుతాడు రిషి. దీంతో వసు పొంగిపోతుంది వసు. గుండెలపై వాలిపోయి.. రిషిని కౌగిలించుకుంటుంది.