Guppedantha Manasu: ఫుల్ గా తాగేసి దేవయాని మీదకు వెళ్లిన మహేంద్ర

గుప్పెడంత మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

Update: 2023-10-10 06:30 GMT

దిశ,వెబ్ డెస్క్: గుప్పెడంత మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

ఇలా ఇంటికి తెచ్చుకుని తాగడం మన ఇంటావంటా ఉందా? అంటూ దేవయాని గట్టిగా అరుస్తుంటుంది. అదంతా చూసి విసిగిపోయిన మహేంద్ర.. పైకి లేచి.. మంచం మీద నుంచే ‘వదినగారు.. నమస్కారం వదినగారు..’ అంటాడు. ఆ మాటకి దేవయాని షాక్ అవుతుంది. ‘వదిన గారు.. మీకో దండం’ అంటూ మంచం దిగి మరీ ఇంకో సారి దన్నం పెడతాడు. ఫుల్ గా తాగేసి ఉంటాడు. తూలిపోతుంటే.. రిషి పట్టుకుంటాడు. ఆపుతూ ఉంటాడు. మహేంద్రని చూసి వసు, ధరణీలు భయపడుతూ ఉంటారు.

‘వదినగారు.. నేను అన్నీ కోల్పోయాను..ఇప్పుడు నా బాటిల్ అయినా నాకు దక్కేలా చెయ్యండి. అది కూడా మీరు దూరం చేస్తారా?’ అంటూ మహేంద్ర అంటాడు. ‘ఏం మాట్లాడుతున్నావ్ మహేంద్రా.. నేనేం చేశాను నిన్ను.. నీ భాదకి నేనే కారణం అయినట్లు అలా మాట్లాడతావేంటీ?’ అని దేవయాని అంటుంది. ‘అవును.. అన్నీ మీరే చేశారు.. అంతా మీరే చేశారు కదా వదినగారు..’ అంటాడు మహేంద్ర కోపంగా, బాధగా. ‘చూశావా రిషీ.. ఎలా మాట్లాడుతున్నాడో..?’ అంటుంది దేవయాని. 

Tags:    

Similar News