Guppedantha Manasu: రిషి మీద ఒట్టేసి మహేంద్ర మాట ఇచ్చాడు.. నిలబెట్టుకోగలడా..?

గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

Update: 2023-11-17 08:10 GMT

దిశ,వెబ్ డెస్క్: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

ఇక మహేంద్ర, అనుపమ మాటలు తలచుకుని తలచుకుని మరి బాధ పడుతుంటాడు. అలాగే జగతి మరణం, తర్వాత శ్మశానంలో జగతి బాడీని కాల్చడం.. ఇలా అన్ని గుర్తు చేసుకుని మరి బాధ పడుతూ.. జగతి ఫొటో ముందు కూర్చొని చాలా ఏడుస్తాడు. ఆ నొప్పి తట్టుకోలేక మందు బాటిల్ అందుకుంటాడు. ఇది తాగేసి .. మరిచిపోవాలని.. బాటిల్ ఎత్తేలోపు.. రిషి వాళ్లు వస్తారు. తాగనివ్వకుండా అడ్డుపడతారు.మీ ఒక్కరికే కాదు డాడ్.. ‘అమ్మని కోల్పోయిన బాధ మాకు కూడా ఉంది. మీ బాధ తక్కువనట్లేదు. కానీ మీకు బాధ తగ్గకపోతే.. బాధ పోయే వరకు ఏడవండి డాడ్.. కానీ మందు మాత్రం తాగొద్దు..అలాగే అనుపమ గారి గురించి ఎక్కువ ఆలోచించకండి.. ఆవిడే మిమల్ని అర్థం చేసుకుంటాది. మీ స్నేహం ఎప్పటికీ అలానే నిలుస్తుంది’ అని రిషి.. అంటాడు. కానీ మహేంద్ర వినిపించుకోడు.

డాడ్ ప్లీజ్.. అమ్మ మనల్ని వదిలిపోయినా.. మనల్ని చూస్తూనే ఉంటుంది. ప్లీజ్.. మీరు తాగడానికి వీల్లేదు .. నా మాట వినండి’ అంటూ బతిమలాడి.. రిషి మీద ఒట్టుపెట్టుకుంచుకుని మరీ బాటిల్ పక్కన పెట్టిస్తాడు రిషి. ‘ఇక తాగను నాన్నా’ అంటూ మాటిస్తాడు మహేంద్ర. ఇక్కడితో ఈ సీను ముగుస్తుంది. 

Tags:    

Similar News