Guppedantha Manasu: మా ప్రేమకి సపోర్ట్ చేసింది అనుపమే అంటూ రిషిధారకు నిజం చెప్పేసిన మహేంద్ర

గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

Update: 2023-11-15 07:55 GMT

దిశ,వెబ్ డెస్క్: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

‘నేను మీ అమ్మని ఎలా ఇష్ట పడ్డానో .. అలాగే అనుపమకు కూడా మీ అమ్మ అంటే చాలా ఇష్టం.. మీ అమ్మ కోసం తనకి ఇష్టమైనది కూడా వదిలేసి.. జగతి చదివే గ్రూప్‌లోనే జాయిన్ అయ్యింది. ఒకసారి తన సీనియర్ ఎవరో మీ అమ్మని అవమానించారని కాలేజ్ మొత్తం పరిగెత్తించి వాడ్ని పిచ్చ కొట్టుడు కొట్టింది.. నిత్యం మీ అమ్మని అంటిపెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుకునేది.. నేను మీ అమ్మ ప్రేమించుకుంటున్నాం అని తెలిసి.. మా ప్రేమకు తనే చేసింది.. మా ప్రేమ కోసం అందరినీ ఎదిరించి మా పెళ్లి చేసింది. ఆ తర్వాత మాకు జాడ కూడా లేదు మళ్లీ .. ఇన్నేళ్లకు వచ్చింది’ అంటూ మహేంద్ర చెబుతుంటాడు.

రిషి, వసు వింటూ ఉంటారు. ‘తనకోసం నేను, మీ అమ్మ చాలా వెతికాం. ఎక్కడా తన ఆచూకీ లేదు. జగతికి చిన్న దెబ్బ తగిలిన విల విల లాడిపోయేది.. అలాంటిది ఇప్పుడు జగతీనే లేదని తెలిసింది. పాపం ఆ మాట వినగానే.. తన గుండె ఆగిపోయి ఉంటుంది. ఇక నుంచి నన్ను ఎలా ట్రీట్ చేస్తుందో? మా స్నేహం ముక్కలైపోయినట్లేనా?’ అంటూ ఏడుస్తాడు మహేంద్ర. 

Tags:    

Similar News