Guppedantha Manasu: మీ కళ్లల్లోకి నేను చూడలేకపోతున్నాను అంటూ రిషి సార్ పై ప్రేమ కురిపించిన వసు
గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
దిశ,వెబ్ డెస్క్: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
ఇక రిషిధారలు ఇద్దరూ ఇంట్లో కూర్చుని కబుర్లాడుతూ ఉండగా.. రిషి కళ్లల్లోకి వసు చూడలేక తల తిప్పుకుంటుంది. ఏమైంది వసుధార అని రిషి అడుగుతాడు. కళ్లు తిప్పేసుకుని.. ‘మీ కళ్లల్లోకి నేను సూటిగా చూడలేకపోతున్నాను సార్’అని వసు అంటుంది వసు. ‘అవునా.. ఎందుకు అలా..? ఎందుకంటే.. ఎందుకంటే..’ అంటూ వసు సిగ్గుపడుతూ ఉంటుంది. ‘సార్.. సార్..’ అంటూ వెనక్కి వాలిపోతుంది వసు. ఇంతలో ఫోన్ రావడంతో.. రిషి పెదవులకు ఫోన్ని అడ్డం పెడుతుంది వసు.
రిషి తగ్గుతాడు. ఫోన్లో పేరు చూసి.. ప్రిన్సిపాల్ అని అంటాడు. లిఫ్ట్ చేయండి సార్ అని వసు అంటుంది. రిషి కాలం లిఫ్ట్ చేసి.. స్పీకర్లో పెడతాడు. అవతల విష్ కాలేజ్ ప్రిన్సిపాల్ గురుచరణ్.. హలో అంటాడు. ‘సార్ చెప్పండి’ అంటాడు రిషి. ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్..’ అని ప్రిన్సిపాల్ అంటాడు. రిషి.. వసు వైపు చూస్తాడు కాస్త ఆశ్చర్యంగా థాంక్యూ సార్ అంటూనే. ‘ఎలా ఉన్నారు సార్?’ అంటాడు గురుచరణ్. ‘బాగున్నాం సార్’అంటాడు రిషి. ‘మీరూ వసుధార మేడమ్ పెళ్లి చేసుకున్నారని పాండ్యన్ చెప్పగానే షాకయ్యా సార్.. చాలా సంతోషంగా ఉందని ప్రిన్సిపాల్ అంటాడు.