Guppedantha Manasu: మను గారితో నాకు సమ్మతమే.. అంటూ అందరికి షాక్ ఇచ్చిన వసుధార
గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
దిశ, సినిమా: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
శైలేంద్ర అయితే.. ‘కొంపముంచారు కదా డాడ్.. మీరు కూడా ఒప్పేసుకున్నారు.. అయినా కాలేజ్ ఎండీగా వసుధార ఒప్పుకోదు కదా’ అని శైలేంద్ర అనుకుంటాడు. ఇక మహేంద్ర కూడా.. ‘మను డైరెక్టర్‌గా ఉండటానికి నేను కూడా ఒప్పుకుంటున్నాను.. కానీ వసుధార అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా’ అని అంటాడు. దాంతో మినిస్టర్.. ‘అమ్మా వసుధారా.. నువ్వు ఏమి అనుకుంటున్నావ్ అమ్మా.. అని అడుగుతాడు. మరి నువ్వేం అంటావ్.. నీ అభిప్రాయం కూడా చెప్పు’ అందరూ అడుగుతారు. కాసేపు సీన్‌ని సాగ్గొట్టిన తరువాత.. ‘మీ ఇష్టమే నా ఇష్టం’ అని అంటుంది వసుధార.
ఏంటి వసుధార నీకు ఇష్టమేనా.. అందరికీ అర్ధం అయ్యేలా చెప్పు.. మను గారు డీబీఎస్టీ కాలేజ్ డైరెక్టర్‌గా ఉండటం నీకు సమ్మతమేనా? అని శైలేంద్ర గట్టిగా అడుగుతాడు. దాంతో వసుధార.. ‘నాకు సమ్మతమే.. నేను కూడా ఒప్పుకుంటున్నాను. మను గారు ఈరోజు నుంచి డీబీఎస్టీ కాలేజ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు’ అని అంటుంది. ఆ ఒక్క మాటతో శైలేంద్ర షాక్ అవుతాడు. ఇక మను అయితే వసుధార వైపు చూస్తూ.. ‘థాంక్స్ మేడం.. ’ అని అంటాడు. ఇక వసుధార వెంటనే లేచి.. ‘నాకు వేరే వర్క్ ఉంది.. నేను వెళ్తాను’ అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తరువాత కాలేజ్ కొత్త డైరెక్టర్ మనుకి అందరూ శుభాకాంక్షలు చెబుతారు.
Read More..