Guppedantha Manasu: రిషి సార్ కి సంతాపం తెలుపుతా అంటూ.. దండ తీసుకొచ్చిన రాజీవ్

గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

Update: 2024-02-09 08:43 GMT

దిశ, ఫీచర్స్: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

ఏంటి మావయ్యా ఎదో అంటున్నావ్.. నా మరదలు కష్టంలో ఉంటే.. నేను ఎలా సైలెంట్ గా ఉంటా చెప్పు..? తనని ఎలా అయినా సంతోష పెట్టాలి. ఆ బాధ నుంచి బయటికి తీసుకుని రావాల్సిన బాధ్యత నాదే అని అంటాడు.

తనని నేనే చూసుకోవాలి మావయ్యా నేనే ఓదార్చాలి’ అని రాజీవ్. ‘మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో.. అసలు ఎవడివిరా నువ్వు?’ చక్రపాణి గట్టి గట్టిగా అరుస్తాడు. ‘ఏంటి మావయ్యా.. నన్ను అప్పుడే మరిచిపోయావా? నేను నీ సొంత అల్లుడ్ని. నీ పెద్ద కూతురి మొగుడిని, ఇంకా నీ చిన్న కూతురి ముద్దల బావని కదా..నువ్వు ఒకే అన్నా.. అనకపోయినా .. ఇప్పుడు వసుధారను పెళ్లి చేసుకుంటా.. ఏం మామా నువ్వు.. అప్పుడే మరిచిపోతే ఎలాగా?’ అంటాడు రాజీవ్ వెటకారంగా.

రాజీవ్ మీద.. చక్రపాణి కోప్పడుతూ ఊగిపోతాడు. అప్పుడే వసుధార కూడా.. రాజీవ్‌ని బాగా తిడుతుంది. అయినా రాజీవ్ అస్సలు ‘అవును.. ఎవరైనా చనిపోతే.. వారి ఫోటోకి పెట్టి దండ వేస్తారు కదా.. అదే నీ రిషి సార్ ఫొటో ఏది వసు ?’ అంటాడు చుట్టూ చూస్తూ. కానీ గోడ మీదే ఉంటుంది కానీ అటు వైపు చూడడు రాజీవ్. ‘హేయ్.. ఒకసారి చెబితే నీకు అర్థం కాదా.. మా రిషి సార్ క్షేమంగానే ఉన్నారు. తను చనిపోలేదు.. ఎక్కడో ఓ చోట బతికే ఉండి ఉంటారు’ అని వసు అంటుంది. ‘అవునా.. అయితే రిషి సార్‌ని ఇప్పుడు, ఇక్కడి రమ్మను నేను కూడా చూస్తా.. బతికాడో లేక చచ్చాడో ? పిలువు ఈ దండను రిషి సార్ మెడలోవేసి వెళ్లిపోతాను. లేదంటే మాత్రం.. హా.. అదిగో ఈ గోడ మీదున్న ఫొటోకి దండ వేసి సంతాపం తెలుపుతాను’ అని రాజీవ్ అంటాడు.

Tags:    

Similar News