Guppedantha Manasu: వసుధార బాధ్యతను అనుపమకి అప్పగించిన మహేంద్ర?

గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

Update: 2023-12-15 08:27 GMT

దిశ,వెబ్ డెస్క్: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

‘ఏ రోజు కూడా నోరు తెరిచి.. ఆ నీచుడి చేసిన తప్పుల గురించి నిజం చెప్పలేకపోయాం.. కానీ ఇప్పుడు వాడి ప్రవర్తన మితిమీరిపోయింది. రాక్షసుడి కన్నా దారుణంగా తయారయ్యాడు.. అనుపమా.. జగతి నా ప్రాణం..తనను నాకు దూరం చేసాడు. వాడే దోషి అని సాక్షాధారాలతో రిషి ముందు నిలబెట్టాలి, నా కొడుకే వాడ్ని శిక్షించాలి. కానీ ఇప్పుడు రిషిని కూడా ఎక్కడో దాచాడు.తనకి ఏమైనా అయితే.. నేను తట్టుకోలేను అనుపమా..’ అని మహేంద్ర అంటాడు.

‘మహేంద్రా.. నేను చెబుతున్నాను కదా? నీ కొడుక్కి ఏం కాదు.. నువ్వు ధైర్యంగా ఉండు.. నువ్వే ఇలా బాధ పడితే.. వసుధారను ఎవరు ఓదారుస్తారు? తనకు ఎవరు ధైర్యం చెబుతారు చెప్పు?’అని అనుపమ అంటుంది. నువ్వు నాకో మాటిస్తావా?’అని మహేంద్ర అడుగుతాడు. ‘ఏంటది?’ అంటుంది అనుపమ. ‘ఏం లేదు.. వసుధారను కంటికి రెప్పలా నువ్వే చూసుకోవాలి’ అంటాడు మహేంద్ర. అనుపమకి ఏం అర్థం కాదు. ‘చెప్పు అనుపమా.. తన బాధ్యత నువ్వు తీసుకుంటావా?’ అంటాడు మహేంద్ర. ఇక్కడితో ఈ సీను ముగుస్తుంది. 

Tags:    

Similar News