Guppedantha Manasu: రాజీవ్, శైలేంద్రకి వార్నింగ్ ఇచ్చిన మను

గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

Update: 2024-03-25 08:44 GMT

దిశ, సినిమా: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

గుప్పెడంత మనసు సీరియల్ రిషికి ముందు, రిషికి తర్వాత అన్నట్టు సాగుతుంది. ఎందుకంటే, రోజుకో కొత్త క్యారెక్టర్లు పుట్టుకొస్తున్నారు. చూసే వాళ్లకి చిరాకు అనిపించి కొందరైతే చూడటమే మానేశారు. డైరెక్టర్ కొత్తగా తీస్తారో.. లేక రిషి లేకుండా మను తో కథ ముగిస్తారనేది చూడాలి.. ఇక నేటి ఎపిసోడ్ లోకి వెళ్తే..

కోపంగా ఊగిపోతున్న మను బయటకు వస్తాడు. తుపాకీ బయటకు తీసి.. మా అమ్మ మీద పొడిచింది ఎవరో మర్యాదగా చెప్పండని అడుగుతాడు. హలో కొంచం ఆగు బ్రదర్.. అసలు మీ అమ్మ ఎవరు? ఆవిడకి మాకు సంబంధం ఏంటి అని రాజీవ్ అంటాడు. మళ్లీ ఏమీ తెలియనట్లుగా కొత్త నాటకం మొదలుపెడతాడు. అప్పుడు శైలేంద్ర.. ఏమి తెలియనట్టు.. ఆమె ఎవరో కాదు రాజీవ్ .. మను వాళ్ల అమ్మ, ఆమె పై ఎటాక్ జరిగిందని చెబుతాడు. అయ్యే.. అవునా బ్రదర్ నిజంగా నాకు తెలీదని రాజీవ్ అంటాడు. అయితే.. శైలేంద్ర కూడా.. అనుపమగారి మీద ఎవరో కత్తితో దాడి చేసారని చెబుతాడు.

ఇద్దరు ఆపండి రా .. మీ నాటకాలన్ని నాకు తెలుసు .. మీరు నా మీద చంపాలని చూసారు .. కానీ మా అమ్మ అడ్డు వచ్చింది అని మను అంటాడు. మగతనం ఉంటే .. నాతో శత్రరుత్వం పెట్టుకోండి .. అంతేకానీ, మా అమ్మ జోలికి వస్తే తాట తీస్తా అంటూ అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. నేను చదివే సమయంలో.. ఒకడు ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ.. మా అమ్మ కాలికి చిన్న గాయం చేశాడనే .. ఉతికి ఆరేసాను .. ఇప్పటికి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడని చెబుతాడు. ఇప్పుడు ఏకంగా మీరు.. మా అమ్మ రక్తం కళ్ల చూశారు.. మీరే చేయించారని తెలిస్తే జాతర అంటే ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తా అంటూ మను వార్నింగ్ ఇస్తాడు. 

Tags:    

Similar News