GST మూవీ డైరెక్టర్ జానకిరామ్ ఆత్మహత్య.. ఆయన తమ్ముడు మిస్సింగ్

Update: 2024-08-06 09:02 GMT

దిశ, గోపాల్పేట: అన్న ఆర్థిక ఆర్థిక సమస్యలతో సూసైడ్ చేసుకొని చనిపోగా ఈ మరణ వార్త విని తమ్ముడు భావోద్యానికి గురై ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన గోపాల్పేట్ మండలంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రానికి చెందిన మూవీ డైరెక్టర్ జానకిరామ్ ఆర్థిక సమస్యలతో సోమవారం హైదరాబాదులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న జానకిరామ్ తమ్ముడు బాలకృష్ణ భావోద్యానికి గురై ఇంటి నుంచి సోమవారం గోపాల్పేట నుండి అతని బైక్ పై బయలుదేరి ఎక్కడికో వెళ్లిపోయాడు. అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్‌లో ఉంది. అతని అన్న మరణ వార్త విని గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ క్రమంలోనే తమ్ముడు బాలకృష్ణ కూడా కనిపించకపోవడంతో గ్రామం అంతా అయోమయంలో పడింది. అతని ఆచూకీ ఎవరికైనా తెలిస్తే 959978998, 9395555705, 9966332413, 9704743921 ఈ నెంబర్కు ఫోన్లు చేయాలని వారు తెలియజేశారు


Similar News