Gopichand: గోపీచంద్ ‘విశ్వం’ టీజ‌ర్‌ రిలీజ్.. ఎలా ఉందంటే..?

గోపీచంద్ ‘విశ్వం’ టీజ‌ర్‌ రిలీజ్.

Update: 2024-09-04 02:29 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఒకప్పుడు గోపిచంద్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ హంగామా చేసే వాళ్ళు కానీ ఇప్పుడు ఈ హీరో వరుస ఫ్లాప్ తో వెనక్కి వెళ్తున్నాడు.. ఎలా అయినా హిట్ ట్రాక్ లోకి వెళ్లాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, గోపీ చంద్ స్నేహం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

శ్రీనువైట్ల డైరెక్షన్లో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘విశ్వం’. ఈ సినిమాలో కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టి.జి.విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. దసరాకి ఈ మూవీ థియేటర్లలో సందడీ చేయనుంది. ఈ క్రమంలోనే మూవీ టీం ప్ర‌మోష‌న‌ల్ ప్రోగ్రామ్స్ ను స్టార్ట్ చేసింది. దానిలోనే భాగంగానే తాజాగా టీజ‌ర్‌ను రిలీజ్ చేసింది.

శ్రీను వైట్ల మార్క్ కామెడీ ఈ మూవీ రూపొందుతున్నట్టు టీజ‌ర్‌ను చూసే అర్థమవుతోంది. ‘మీరు ఫైట్ చేసిన స్టైల్‌ను బ‌ట్టి చూస్తే మీకు మార్ష‌ల్ ఆర్ట్స్ అని తెలుస్తుంది .. నాకు గీతా ఆర్ట్స్.. ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప మరే ఇంకేం తెలియదు..’ అనే డైలాగ్ సూపర్ పేలింది. గోపిచంద్‌కు, శ్రీనువైట్ల‌కి ఈ మూవీ విజ‌యం చాలా ముఖ్యం.

Full View

Tags:    

Similar News