ఆ స్టార్ హీరో మేనకోడలితో గోపీచంద్ లవ్‌.. ఇన్నాళ్లకు బయటపడ్డ అసలు నిజం!

సీనియర్ హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

Update: 2024-03-08 14:57 GMT

దిశ, సినిమా: సీనియర్ హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కెరీర్ స్టార్టింగ్ లో హిట్ల మీద హిట్లు కొట్టి వరుస సినిమా అవకాశాలు అందుకున్నాడు గోపించంద్. తర్వాత ఈ హీరోకు అవకాశాలు తగ్గాయి. సినిమాల విషయం పక్కన పెడితే గోపీచంద్ పెళ్లి గురించి నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది. గోపీచంద్ పెళ్లి చేసుకుంది అరేంజ్డ్ మ్యారేజ్ అని అందరూ భావిస్తున్నారు కానీ.. ఈ హీరో ప్రేమ చేసుకుంది ప్రేమ వివాహం.

ఈ హీరో ప్రేమ కథలో భారీ ట్విస్టులే ఉన్నాయి. హీరో శ్రీకాంత్ మేనకోడలిని గోపీచంద్ ఓ ఈవెంట్ లో చూశాడట. చూడగానే తెగ నచ్చేసిందట. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని ఈ హీరో నిర్ణయించుకున్నాడట. ఈ విషయాన్ని డైరెక్ట్ గా ఎలా చెప్పాలో తెలియక.. సీనియర్ నటుడు చలపతి రావు తో తన మనసులోని మాటను చెప్పించాడట. విషయం శ్రీకాంత్ కు కూడా తెలియడంతో.. గోపిచంద్ కు బాగా సపోర్ట్ చేశాడట. పెళ్లి ఫిక్స్ అయ్యాక రేష్మ గోపిచంద్ కు టీ షర్ట్ గిఫ్ట్ గా ఇచ్చిందని గోపిచంద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.


Similar News