RRR మూవీకి అరుదైన ఘనతను ఇచ్చిన గూగుల్
దిశ, వెబ్‌డెస్క్: ఆర్ఆర్ఆర్ కు దర్శకత్వం వహించిన దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమా లో అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీం పాత్రలో జూ. ఎన్టీఆర్ వీరిద్దరు కలిసి ప్రధాన పాత్రలో నటించిన విషయం అందరికీ తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ వచ్చిన RRR సినిమాలో అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్, కొమురం భీంగా జూ. ఎన్టీఆర్ ఇరగదీసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై.. బాహుబలిని మించి కలెక్షన్స్‌లో దూసుకుపోయింది. దాదాపుగా రూ.1200 కోట్ల పైగా వసూళ్లు రాబట్టింది. ఆర్ఆర్ఆర్ డిజిటల్ రైట్స్‌ను జీ 5, నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా, RRR సినిమాను గూగుల్‌లో సెర్చ్ చేస్తే స్క్రీన్‌పై బైక్, గుర్రం పరిగెడుతున్నట్లు యానిమేషన్‌లో కనిపిస్తుంది. ఓ పాటలో ఎన్టీఆర్ బైక్‌పై, రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేయడం ఉంటుంది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడంతో గూగుల్ యానిమేషన్ సింబల్స్‌ను యాడ్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సినిమాలకు యానిమేషన్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. గూగుల్ ఇచ్చిన సర్‌ప్రైజ్ ట్వీట్టర్‌లో కూడా ట్రెండ్ అవుతోంది.