Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఫాన్స్‌కి గుడ్ న్యూస్.. ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా రీ రిలీజ్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కీర్తి రెడ్డి కలిసి నటించిన చిత్రం ‘తొలిప్రేమ’. ఈ సినిమాకు ఎ కరుణాకరణ్ దర్శకత్వంలో తెరకెక్కించారు.
దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కీర్తి రెడ్డి కలిసి నటించిన చిత్రం ‘తొలిప్రేమ’. ఈ సినిమాకు ఎ కరుణాకరణ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. 1998లో ‘తొలిప్రేమ’ మూవీ విడుదలై బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా మంచి కలెక్షన్స్ రాబట్టి దూసుకుపోయింది. అయితే ఈ సినిమా విడుదలై 25 సంవతర్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫ్యాన్స్‌కు చిత్రయూనిట్ గుడ్ న్యూస్ తెలిపారు. తాజాగా, ఈ సినిమా జూన్ 30న రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దాదాపు 300 థియేటర్లలో 4K హెచ్‌డీలో రీరిలీజ్ చేయనున్నట్లు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో అది చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ 30 తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ ప్రస్తుతం నాలుగైదు సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటూనే రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నాడు. వారాహి యాత్రలో బిజీగా ఉండటం వల్ల సినిమాలు కాస్త లేట్‌గా విడుదల అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Leo first-look poster released : విజయ్ దళపతి బర్త్ డే స్పెషల్
నాకంటే ప్రభాస్, మహేశ్ బాబు చాలా పెద్ద హీరోలు.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు