అమితాబ్‌ను దేవుడు నా కోసమే పంపించారు కావొచ్చు.. డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్

బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్‌పై డైరెక్టర్ సుజోయ్ ఘోష్ ప్రశంసలు కురిపించారు.

Update: 2024-10-06 13:36 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్‌పై డైరెక్టర్ సుజోయ్ ఘోష్ ప్రశంసలు కురిపించారు. ఆయన కష్ట సమయాల్లో అండగా నిలబడ్డారంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో సుజోయ్ మాట్లాడుతూ.. ‘‘అమితాబ్, రితేష్, జాక్వెలిన్ కాంబోలో ‘అలాదీన్’ తెరకెక్కించాను. అయితే కథ వినగానే అమితాబ్ మాటిచ్చారు. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా 2009లో విడుదలై పరాజయం అందుకుంది. అలాదీన్ 17 మంది చూస్తే.. అందులో 15 మంది మా కుటుంబ సభ్యులే ఉన్నారు. ఆ సమయంలో ఎంతో బాధ పడ్డాను. ఆ తర్వాత ‘కహాని’ మూవీ కథతో ఎంతో మంది వద్దకు వెళ్లా.

కానీ ఎవరూ ఓకే చేయలేదు. అంతేకాకుండా ఇది వర్కౌట్ కాదని సలహా ఇచ్చారు. కానీ నేను వెనకడుగు వేయకుండా సొంత డబ్బుతో నిర్మించాను. అమితాబ్ నన్ను నమ్మి ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అది మాకు ప్లస్ అయింది. ఒకవేళ దేవుడు బిజీగా ఉండి మరొకరిని సాయం చేయడానికి పంపుతారు అంటారు కదా. అలా నాకు సాయం చేయడం కోసం అమితాబ్ బచ్చన్‌ను పంపినట్లుగా అనిపించింది’’ అని చెప్పుకొచ్చారు. ఇక అమితాబ్ గొప్ప మనసు తెలుసుకున్న నెటిజన్లు గ్రేట్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.


Similar News