మాజీ ప్రియుడి సపోర్టుతోనే నటిగా మారిన రష్మిక!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న మాజీ ప్రియుడు రక్షిత్‌ శెట్టి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Update: 2023-03-23 11:06 GMT

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న మాజీ ప్రియుడు రక్షిత్‌ శెట్టి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవలే రిషబ్ శెట్టి సినిమా ‘కాంతారా’పై కాంట్రవర్సీ కామెంట్స్‌తో విమర్శలు ఎదుర్కొన్న ఆమె.. తాజాగా ఓ సమావేశంలో తన బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతూ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ మేరకు ‘నాకు చిన్నప్పటి నుంచి హీరోయిన్ అవ్వాలనే కోరిక ఉండేది. దీంతో ఎక్కడ సినిమా ఆడిషన్స్‌ జరిగినా వెళ్లేదాన్ని. అవకాశం రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగేదాన్ని. కొన్నిసార్లు సహనం కోల్పోయి నటన అనేది నాకు సెట్‌ కాదని, అది రాసి పెట్టలేదని అనుకునేదాన్ని. అనుకోకుండా ఓ అందాల పోటీలో పాల్గొని టైటిల్‌ సొంతం చేసుకున్నా. దీంతో నా ఫొటో అన్ని పత్రికల్లో వచ్చింది. దీంతో రక్షిత్‌ శెట్టికి సంబంధించిన నిర్మాణ సంస్థ ‘పరంవా స్టూడియోస్‌’ నుంచి కాల్‌ వచ్చింది. ‘కిరాక్‌ పార్టీ’ మూవీలో నాకు లీడ్‌ రోల్‌ ఆఫర్‌ చేశామని మేకర్స్ చెప్పారు. అలా నటిగా నా కెరీర్ స్టార్ట్ అయింది’ అని రష్మిక చెప్పుకొచ్చింది.

Read more:

నాగ చైతన్య కొత్త ఇంటికి వచ్చిన మొదటి అతిథి.. ఎవరో తెలుసా?

Tags:    

Similar News