ఫుల్ ఫన్.. డార్లింగ్ రిలీజ్ ట్రైలర్

కొంతకాలం విరామం తీసుకుని ఇప్పుడు ‘డార్లింగ్’ అనే కొత్త మూవీతో మన ముందుకి రాబోతుంది.

Update: 2024-07-16 04:21 GMT

దిశ,సినిమా: ఇస్మార్ట్ శంకర్ మూవీతో తెలుగు వారికి పరిచయమైన నభా నటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీలో నభా తెలంగాణ యాసలో మాట్లాడి అదరగొట్టింది. కెరీర్ మంచిగా ముందుకు వెళ్తున్న సమయంలో ఆమె జీవితంలో విషాదకర ఘటన వల్ల చాలా కృంగిపోయింది. యాక్సిడెంట్ కావడంతో కొంతకాలం విరామం తీసుకుని ఇప్పుడు ‘డార్లింగ్’ అనే కొత్త మూవీతో మన ముందుకి రాబోతుంది.

కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న ప్రియదర్శి, నభా నటేష్ కలిసి జంటగా నటించిన ఎంటర్ టైనర్ డార్లింగ్. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియోట్ చేసింది. ఈ మూవీ జూలై 19 న థియేటర్లలో సందడీ చేయనుంది.

ఈ క్రమంలోనే తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో ప్రియదర్శి , నభా నటేశ్ మధ్య సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. కొత్తగా పెళ్లి చేసుకుని మంచిగా కాపురం చేద్దామనుకున్నా ప్రియదర్శి, తన భార్యతో పడే ఇబ్బందులు, ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలు నవ్వులు పూయించాయి. నీ పెళ్ళాం నిన్ను కొట్టిందంటే ఒక అర్ధం ఉంది.. నీ ఫ్రెండ్స్ ను కూడా కొట్టడం ఏంట్రా వంటి ఫన్ డైలాగ్స్ తో ట్రైలర్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది.

Full View


Similar News