టాలీవుడ్ అగ్ర హీరోల ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ.. తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలు.
దిశ, సినిమా: మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ.. తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలు. ప్రస్తుతం బాలీవుడ్‌ను క్రాస్ చేసి.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఇండియన్ సినిమా అంటే.. టాలీవుడ్ ముందు కనిపిస్తుంది. ఇక తర్వాతే బాలీవుడ్ అయినా, కోలీవుడ్ అయినా. టాలీవుడ్ హీరోలకు ప్రస్తుతం అంత డిమాండ్ ఉంది మరీ. ఈ కారణంగా హీరోల పారితోషికం కూడా భారీగా పెరుగుతూ వస్తుంది. కాగా టాలీవుడ్లో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న హీరోల ఫస్ట్ రెమ్యునరేషన్ గురించి ప్రస్తుతం నెట్టింట చర్చకు దారీ తీసింది. కెరీర్ స్టార్టింగ్‌లో ఎవరెవరు ఎంత పారితోషికం అందుకున్నారో.. ప్రస్తుతం ఎంత తీసుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
సూపర్ స్టార్ మహేష్ బాబు..
సూపర్ స్టార్ వారసుడిగా ఇండస్ట్రీకి ఇచ్చిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఈయన మొదటి సినిమాకు 10 లక్షల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారట. ప్రస్తుతం ప్రిన్స్ రూ. 100 కోట్లకు దగ్గరల్లో తీసుకుంటున్నట్లు టాక్.
మెగాస్టార్ చిరంజీవి..
మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ సినిమాకు కేవలం 1116 రూపాయల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నారట. ఇప్పుడు దాదాపు 50 నుంచి 60 కోట్ల రూపాయల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 1996 లో తెరకెక్కిన అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమాలో మొదటిసారిగా నటించారు. ఈ మూవీకి పవర్ స్టార్ కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే తీసుకున్నారట. ప్రస్తుతం 80 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..
రీసెంట్ గా సలార్ చిత్రంతో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ రెమ్యునరేషన్ రూ. 15 లక్షలు తీసుకున్నారట. ప్రస్తుతం ప్రభాస్ రూ. 200 కోట్ల వరకు తీసుకుంటున్నారట.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..
బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను కొల్లగొట్టిన గంగోత్రి సినిమా అల్లు అర్జున్ మొదటి మూవీ. ఈ సినిమాకు బన్నీ 20 లక్షల రూపాయలు పారితోషికం అందుకున్నారట. ఇప్పుడు పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ.. ఏకంగా 100 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్..
ఆర్ఆర్ఆర్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న జూనియర్ ఎన్టీఆర్ స్టార్టింగ్ లో రూ. 5 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రూ. 80 నుంచి 100 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.
పవర్‌స్టార్ రామ్ చరణ్..
తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు మెగా పవన్ స్టార్ రామ్ చరణ్. చిరుత సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీకి చరణ్ 50 లక్షల రూపాయలు తీసుకున్నారట. ఇప్పుడు ఒక్కో మూవీకి 100 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం.