స్టార్ హీరోయిన్ అండ్ స్టార్ డైరెక్టర్ మధ్య గొడవ.. తట్టుకోలేక ఏం చేసిందంటే?
కామన్‌గా ఇండస్ట్రీలో డైరెక్టర్లకు, మూవీ టీమ్‌కు మధ్య గొడవలు సర్వసాధారణం.
దిశ, సినిమా: కామన్‌గా ఇండస్ట్రీలో డైరెక్టర్లకు, మూవీ టీమ్‌కు మధ్య గొడవలు సర్వసాధారణం. షూటింగ్ సమయంలో పలు గొడవల కారణంగా ఎంతో మంది నటీనటులు సినిమా నుంచి తప్పుకున్నవారు ఉన్నారు. తాజాగా ఓ దర్శకుడు, హీరోయిన్ మధ్య గొడవ జరిగిందట. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఓ మూవీ.. సెట్లో హీరోయిన్‌కు కెమెరా ముందే కూర్చోవాలని.. బ్రేక్ ఇవ్వకుండా సీన్ చెప్పాలని పట్టుబట్టారట.
అప్పటికే మూడు సార్లు తనకు ఇబ్బందిగా ఉందని చెప్పినా కూడా వినకపోవడంతో.. దర్శకుడి తీరు నచ్చని ఆ హీరోయిన్ సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుందట. ఈ గొడవ కాస్త పెద్దదై ప్రొడ్యూసర్ దగ్గరకు వెళ్లడంతో, మూవీ ఇలా మధ్యలో ఆగిపోతే కష్టమని.. ఆమెను చాలా బతిమిలాడి, దండం పెట్టి మరీ ఒప్పించాడట. నిర్మాత పై ఉన్న గౌరవంతో ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించిందని టాక్.
ఈ ఇష్యూ టాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగినట్లు సోషల్ మీడియాలోని జనాలు చర్చించుకుంటున్నారు. ఫస్ట్ చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ హీరోయిన్ రెండో సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు నటించే సినిమా ఆమెకు మూడో చిత్రం. ఇక హీరో అండ్ డైరెక్టర్ కూడా స్టార్స్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వీరి కాంబినేషనలో ఓ సినిమా కూడా వచ్చినట్లు సమాచారం. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, పాటలు కూడా ప్రేక్షకులకు బాగా ఆకట్టుకున్నాయి.