ఆ రాత్రి వదిలేయమని వేడుకున్నా వినలేదు.. ముంబైలో చేదు అనుభవం పై నటి

Update: 2022-01-26 15:09 GMT

దిశ, సినిమా : మలయాళ మూవీ 'ఒరు ఆడార్ ల‌వ్'లో క‌న్ను గీటి కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన నటి ప్రియా వారియ‌ర్. ఆ ఒక్క సీన్‌తో రాత్రికి రాత్రే పెద్ద స్టార్‌గా ఎదిగిన తనకు తాజాగా ఓ చేదు అనుభ‌వం ఎదురైనట్లు తెలిపింది. షూటింగ్‌ కోసం ఇటీవలే ముంబై వెళ్లిన ప్రియ, ఒక హోటల్‌లో బస చేయగా.. అక్కడి సిబ్బంది తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. 'నేను బస చేసిన ఫెర్న్ గొరెగాన్ హోట‌ల్‌ రూల్స్ తెలియక బయట నుంచి ఫుడ్ తీసుకెళ్లా.

అయితే హోటల్ సిబ్బంది నా ఫుడ్‌ను లోపలికి అనుమతించలేదు. ఈ ఒక్కసారికి వ‌దిలేయమని ఎంత వేడుకున్నా వినలేదు. పెద్ద సీన్ చేయడమే కాక నాతో చాలా అమ‌ర్యాద‌గా ప్రవ‌ర్తించారు. దీంతో బ‌య‌ట చలిలో భోజ‌నం చేయాల్సి వ‌చ్చింది' అంటూ తన అనుభవాన్ని ఇన్‌‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకుంది. దీనిపై స్పందిస్తున్న అభిమానులు హోటల్ యాజమాన్యంపై మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు.

https://www.instagram.com/reel/CZJ9Z4XqsaH/?utm_source=ig_web_copy_link

Tags:    

Similar News