పార్టీలో జుట్టు గొడవ.. కన్నీళ్లు ఆగలేదన్న హీరోయిన్

సెలబ్రిటీలు పొగరుబోతులని కొందరు అభిప్రాయపడుతుంటారని.. అవమానించేందుకు ప్రయత్నిస్తుంటారని తెలిపింది బాలీవుడ్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్.

Update: 2023-11-29 13:37 GMT

దిశ, సినిమా : సెలబ్రిటీలు పొగరుబోతులని కొందరు అభిప్రాయపడుతుంటారని.. అవమానించేందుకు ప్రయత్నిస్తుంటారని తెలిపింది బాలీవుడ్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్. తాను ఈ మధ్య ఓ ఫ్రెండ్ పార్టీకి వెళ్లానని.. అక్కడ ఇలాంటి ఘటనే ఎదురైందని చెప్పింది. అయితే ఇదంతా స్పృహలో ఉండి చేస్తున్నాననే విషయాన్ని కప్పి పుచ్చుకునేందుకు.. ఆమె డ్రింక్ చేసి మరీ తనను అనవసరంగా తిట్టిందని తెలిపింది.

‘నేను పార్టీకి నైస్ మేకప్ వేసుకుని, హెయిర్ లీవ్ చేసి వెళ్లాను. అనుకోకుండా ఓ అమ్మాయి తాగి తనపైకి గొడవకు వచ్చింది. నీ ఫేస్ అందంగానే ఉంది కానీ హెయిర్ మాత్రం బాగాలేదని రూడ్‌గా బిహేవ్ చేసింది. లైనర్ వేస్తానని, జుట్టుకు బ్యాండ్ వేస్తానని చెప్పింది. బాగా వేడిగా ఉంది కదా హెయిర్ ఎందుకు టైట్ చేసుకోలేదని గట్టిగట్టిగా మాట్లాడింది’ అని.. వెంటనే తాను కూడా బేఫిట్టింగ్ రిప్లయ్ ఇచ్చానని తెలిపింది ఫాతిమ. ‘నేను టై చేసుకోను. ఇది నా హెయిర్. నా ఇష్టం. నన్ను నీకు నచ్చినట్లుగా మార్చుకోవాలంటే ఊరుకోను’ అని వార్నింగ్ ఇచ్చానంది. కానీ ఈ మొత్తం సంఘటనతో తన కళ్లలో నీళ్లు తిరిగాయని.. ఏడ్చేశానని తెలిపింది ఫాతిమ.

Tags:    

Similar News