Extra Ordinary Man Twitter Review: ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ ట్విట్ట‌ర్ రివ్యూ

వక్కంతం వంశీ చాలా గ్యాప్ తరువాత మళ్లీ దర్శకుడిగా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాకి దర్శకత్వం వహించాడు.

Update: 2023-12-08 03:30 GMT

దిశ,వెబ్ డెస్క్: వక్కంతం వంశీ చాలా గ్యాప్ తరువాత మళ్లీ దర్శకుడిగా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. పూర్తి ఎంటర్టైన్మెంట్ సినిమాగానే తీసినట్టుగా ప్రమోషన్స్‌లో చెప్పుకొచ్చారు. మేం పూర్తిగా నవ్వించేలానే ఈ సినిమాను తీశామని దర్శక నిర్మాత, హీరో నితిన్ ఇలా అందరూ చెప్పుకొచ్చారు. నేడు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఈ మూవీ మీద చర్చలు స్టార్ట్ అయ్యాయి. సినిమాను చూసిన నెటిజన్లు తమ తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు.

ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మాత్రమే.. మీరు సినిమాను చూసి నెగెటివ్ చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ నవ్వుతారు.. నవ్వకపోతే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిందే.. సెకండాఫ్‌లో సాంగ్స్ అనేవి అదనపు ఆకర్షణగా మారాయి.. అని ఓ నెటిజన్ అన్నాడు.


Similar News