స్వలింగ సంపర్కుల మధ్య శృంగారం చూసి ఎంతో ఎగ్జైట్ అయ్యా!.. సోనాక్షి సిన్హా హాట్ కామెంట్స్

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ ‘హీరామండి: ది డైమండ్ బజార్’.

Update: 2024-05-08 08:02 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ ‘హీరామండి: ది డైమండ్ బజార్’. 1940ల కాలంలో భారత్ బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి హీరామండి అనే రెడ్ లైట్ ప్రాంతంలో, జీవనం సాగించిన డ్యాన్సర్ల జీవితాల గురించి ఈ సిరీస్‌లో దర్శకుడు భన్సాలీ చూపించారు. అంటే బ్రిటిష్ పాలనలో దారుణాలు ఎదుర్కొన్న ఆ మహిళల గురించి ఎన్నో విషయాలను ఈ సిరీస్‌లో చూపించాడు. కాగా, ఈ సిరీస్‌లో మనీష కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్, షార్మీన్ సెగల్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం అందరికీ తెలిసినదే.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాక్షిని ఈ సిరీస్ లో ఇద్దరు మహిళలు రొమాన్స్ చేసే సన్నివేశం ఉంది. దీన్ని ఎలా మేనేజ్ చేశారన్న ప్రశ్నకు సోనాక్షి ఆసక్తికర కామెంట్స్ చేసింది. 'మొదట్లో, భన్సాలీ నాకు నా పాత్ర గురించి.. హీరమండి గురించి ఓపెన్‌గా చెప్పారు. కథ విని నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. మా సిరీస్‌లో ఫరీదాన్ అనే పాత్రను పోషించాను. అందులో ఆమె స్వలింగ సంపర్కురాలు' అని సోనాక్షి సిన్హా చెప్పుకొచ్చింది.

ఫరీదాన్, ఆమె ఇంటి పనిమనిషి మధ్య శృంగారం జరిగిన సన్నివేశం గురించి సోనాక్షి మాట్లాడుతూ 'నేను చేసిన ఫరీదాన్‌ పాత్రలో 9 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే తనను అమ్మేస్తారు. ఈ కారణంగా ఆమె పురుషులను ద్వేషిస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో ప్రతిదీ ఓపెన్‌గా చాలా భిన్నమైన కథను భన్సాలీ చూపించారు' అని సోనాక్షి అన్నారు.

Tags:    

Similar News