రోజూ రాత్రి ఆ విషయంలో నా భర్తను నేనే బలవంతం చేస్తా: హన్సిక కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ హీరోయిన్ హన్సిక, అల్లు అర్జున్ ‘దేశముదురు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

Update: 2023-08-28 03:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ హన్సిక, అల్లు అర్జున్ ‘దేశముదురు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ఆపిల్ బ్యూటీగా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఇటీవల సోహెల్ ఖతురియాను ప్రేమించి గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంది. ఇక వివాహ బంధంలోకి అడుగు పెట్టాక సినిమాలకు దూరం అయిందనే చెప్పాలి. కానీ, సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ బోల్డ్ ఫొటో షూట్స్‌తో కుర్రకారు మతి పోగొడుతుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హన్సిక మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందో బయటపెట్టింది. ‘‘ నా మ్యారీడ్ లైఫ్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా మంచి వాడిని పెళ్లి చేసుకున్నాను. నాకు వెబ్‌సిరీస్ అంటే చాలా చాలా పిచ్చి ఒక్కసారి నచ్చితే నైట్ మొత్తం ఆ సిరీస్ కంప్లీట్ అయ్యేవరకు అస్సలు నిద్రపోను. అంతేకాదు రోజూ రాత్రి నాతో పాటు నా భర్తను కూడా ఆ సిరీస్ చూడమని బలవంతం చేస్తాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు హన్సికకు వెబ్‌సిరీస్‌లు అంటే అంత పిచ్చా? అని అనుకుంటున్నారు.

Also Read:    Krishna Mukunda Murari ఆగస్ట్ 28: ఈ రోజు ఎపిసోడ్ లో కృష్ణ అంటే చాలా ఇష్టమని రేవతికి చెప్పిన మురారి

Tags:    

Similar News