Ashwini Dutt: అతనితో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. ఇప్పటికీ ఆశ ఉంది: అశ్వనీదత్

స్టార్ నిర్మాత అశ్వనీదత్ పలు తెలుగు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Update: 2024-09-29 09:48 GMT

దిశ, సినిమా: స్టార్ నిర్మాత అశ్వనీదత్ పలు తెలుగు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల అశ్వనీదత్ వైజయంతీ బ్యానర్‌పై కల్కి సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ మూవీ జూన్ 27న విడుదలై ఘన విజయాన్ని సాధించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా రూ. 1150 కోట్లు వసూలు చేసింది. అయితే ఇందులో ప్రభాస్, దీపికా పదుకొణె, మృణాల్, దుల్కర్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ నటించి మెప్పించారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్వనీదత్, రాజమౌళితో సినిమా చేయాలని ఉందంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘రాజమౌళి తెరకెక్కించిన స్టూడెంట్ నం1 సినిమాకు నేను ప్రజంటర్‌గా వ్యవహరించాను. తొలి మూవీ అయినప్పటికీ ఆయన అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పుడు ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తనతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కాకపోతే కుదరడం లేదు. ఇప్పటికీ ఆ ఆశ ఉంది’’ అని చెప్పుకొచ్చారు.


Similar News