నాగార్జున వద్దు ఇంట్రెస్ట్ లేదన్నా బలవంతంగా అది నేర్పాడు.. స్టార్ హీరోయిన్ కామెంట్స్ వైరల్!

ఒప్పప్పటి స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ అందరికీ సుపరిచితమే. ఆమె ఇష్టం మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

Update: 2024-03-16 07:04 GMT

దిశ, సినిమా: ఒప్పప్పటి స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ అందరికీ సుపరిచితమే. ఆమె ఇష్టం మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత స్టార్ హీరోలతో నటించి అందరినీ కట్టిపడేసింది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళంలో వరుస చిత్రాల్లో నటించి కొద్ది కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగింది. ఆ తర్వాత ఆండ్రీ కొస్చీవ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఓ కూతురు కూడా పుట్టింది. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన శ్రియా ఇటీవల కబ్జా మూవీతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది.

తాజాగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రియా టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జునపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘తెలుగులో అద్భుతమైన నటులు చాలామంది ఉన్నారు. వారిలో కొందరితో నేను కూడా నటించాను. అందులో నాకు నచ్చిన హీరో మాత్రం నాగార్జున. ఎందుకంటే.. ఆయన ఒక స్టార్ హీరోలా కాకుండా ఫ్రెండ్‌లా అన్ని అర్థమయ్యేలా చెప్పేవాడు. ఆయనతో నటించే సమయంలో ధ్యానం ఎలా చేయాలో నేర్పించారు. ఫస్ట్‌లో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు.

దీంతో నేను వద్దు వద్దు అని చెప్పాను. కానీ నాగ్ బలవంతంగా నేర్పించాడు. ఇప్పటికీ నేను ధ్యానం చేయడం వల్లనే నా లైఫ్‌లో ఎదురయ్యే పరిస్థితులను ఎదురుకోగలుగుతున్నాను. అంతేకాదు నాగార్జున నా కోసం చాలా గిఫ్ట్ లు కూడా తెచ్చేవారు. మా మధ్య ఎన్నో ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్రియా కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.


Similar News