ఆస్కార్ వచ్చినా... మూలాలు మరువని చంద్రబోస్
ఎంతమంచి రచయిత అయినా.. కాలం కలిసి రాకపోతే అతను లోకానికి తెలియకుండా ఒంటరిగా మిగిలిపోతాడు.
దిశ, వెబ్ డెస్క్: ఎంతమంచి రచయిత అయినా.. కాలం కలిసి రాకపోతే అతను లోకానికి తెలియకుండా ఒంటరిగా మిగిలిపోతాడు. కానీ, ఆ రచయితలోనే టాలెంట్ ను గుర్తించి వారికి అవకాశం కల్పించిన వారే ఆ రచయితకు దేవుడిలా కనబడతారు. సరిగ్గా ఇదే సంఘటన గేయ రచయిత చంద్రబోస్ నిజ జీవితంలోనూ జరిగింది. చూపించాడు. నేడు అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డ్ అందుకున్న ఆయన, నాటి మూలాలను ఏనాడు మరువలేదు. ఆస్కార్ చేత పట్టుకొని, తనకు మొదటి అవకాశం కల్పించిన వ్యక్తులను, ప్రాంతాలను తిలకిస్తూ పాత రోజులను నెమరువేసుకుంటున్నాడు.
ఆస్కార్ తో నగరంలో అడుగుపెట్టిన చంద్రబోస్ కు ఘన స్వాగతం లభించింది. అలా అపూర్వ స్వాగతం మధ్య ఇంటికి చేరుకున్న చంద్రబోస్, వెనువెంటనే రామానాయుడు స్టుడియోస్ కు వెళ్లారు. దాదాపు 28 ఏళ్ల కిందట అక్కడే ఆయన తొలి పాట రాశారు. అందుకే ఆస్కార్ తో పాటు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. కెరీర్ తొలినాళ్లను, రామానాయుడు తనను ప్రోత్సహించిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. తను ఆస్కార్ అందుకున్న సందర్భంగా మనసులో మూవీ మెఘల్ రామానాయుడుకు ఆయన కుమారుడు సురేష్ బాబుకు ప్రత్యే కృతజ్ఞతలు తెలియజేశారు.
అదేవిధంగా తన చిత్రాల ద్వారా గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుడు రాఘవేంద్రరావును మర్యాదపూర్వకంగా కలిశారు చంద్రబోస్. సినీ ప్రపంచంలో అత్యుత్తమ పురస్కారమైన ఆస్కార్ ను సాధించినా. .ఇలా తన కెరీర్ కు సహకరించిన వ్యక్తుల్ని, పని చేసిన ప్రదేశాల్ని చంద్రబోస్ గుర్తు చేసుకోవడం అతని గొప్పతనమని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Also Read..