దిశ, సినిమా : బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో ఎవెలిన్ శర్మ ఒకరు. కూతురు 'అవా' కు జన్మనిచ్చిన ప్పటి నుంచి తన మాతృత్వ అనుభవాలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే బిడ్డకు పాలిచ్చే పిక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా.. నెటిజన్లు సదరు చిత్రాలను ట్యాగ్ చేస్తూ ఆమె బాడీ పై ట్రోలింగ్ మొదలుపెట్టారు. అయితే కొన్ని రోజులపాటు సంయమనం పాటించిన నటి తాజాగా ఆ ట్రోల్స్‌పై స్పందించింది.
'ఇలాంటి చిత్రాలు ఒకే సమయంలో దుర్బలత్వం- బలాన్ని చూపుతాయి. నేను ఆ ఫోటోలను అందంగా భావిస్తున్నాను. తల్లి పాలివ్వడమనేది అత్యంత సహజ, ఆరోగ్యకర విషయాల్లో ఒకటి. ఆ సమయంలో బేబీతో ఏర్పరచుకున్న బంధం చాలా అందమైనది, విలువైనది. మహిళలు రొమ్ములు కలిగి ఉండేందుకు ఇదే బలమైన కారణం. కాబట్టి దాని గురించి ఎందుకు సిగ్గుపడాలి?' అంటూ ట్రోలర్స్‌కు జ్ఞానోదయం కలిగించింది. 'పాలివ్వడమనేది చాలా కఠిన ప్రక్రియ. కొత్తగా తల్లైన ప్రతి స్త్రీ శారీరకంగా, మానసికంగా అలసిపోయి ఉంటుంది. ఆ సమయంలో ఏం చేయాలో, ఏం చేయకూడదో మీరు సలహాలు ఇచ్చినంత సులభం కాదు. మీ జీవితానికి ఏది బాగా పనికొస్తుందో అది చేయండి' అంటూ చురకలు అంటించింది.
https://www.instagram.com/p/CY78orgvd8I/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/CY0KlLcPcdG/?utm_source=ig_web_copy_link