డైరెక్టర్ కోసం లో దుస్తుల్లో నటించిన ఇషా.. ఊహించని షాక్ ఇచ్చిన తల్లి
బాలీవుడ్ స్టార్ కిడ్ ఇషా డియోల్ మరోసారి తన ఫస్ట్ బికినీ ఎక్స్‌పీరియన్స్‌పై ఓపెన్ అయింది.
దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ కిడ్ ఇషా డియోల్ మరోసారి తన ఫస్ట్ బికినీ ఎక్స్‌పీరియన్స్‌పై ఓపెన్ అయింది. 2004లో వచ్చిన ‘ధూమ్’లోని ఓ సాంగ్ కోసం బికినీ వేసుకుని సముద్ర తీరాన అందాలు ఆరబోసిన బ్యూటీ.. సెమీ న్యూడ్ లుక్‌లో నటించాలని దర్శకుడు చెప్పినప్పుడు భయాందోళనకు గురయ్యానని చెప్పింది. ‘టూ పీస్ బికినీ ధరించాలని చెప్పగానే మా అమ్మతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పాను. వెంటనే అమ్మ హేమ మాలిని దగ్గరకెళ్లి భయపడుతూనే విషయం చెప్పాను. కానీ ఆమె నాకు ఊహించని షాక్ ఇచ్చింది. నీవు నన్ను సీరియస్‌గానే అడుగుతున్నావా? నీలాంటి పిల్లలు ఇలాంటి తల్లులను కూడా అడుగుతున్నారా? నిజం చెప్పు స్నేహితులతో సెలవులకు వెళ్లినపుడు బీచ్‌ల్లో బికినీ ధరించలేదా?’ అంటూ తిరిగి ప్రశ్నించిందని గుర్తు చేసుకుంది. ఇక తన కెరీర్‌లో తాను పోషించిన ఈ పాత్ర చాలా అందమైనదని, కఠినంగా అనిపించినా.. డైరెక్టర్ కోరుకున్న విధంగా బోల్డ్ లుక్స్‌లో కనిపించి ప్రేక్షకుల ఆశీర్వాదాలు పొందినందుకు ఇప్పటికీ హ్యాపీగా ఫీల్ అవుతానని చెప్పింది.
Read More: అర్దరాత్రులు ఇంటికొస్తున్న శ్రీదేవి చిన్న కూతురు.. ఖుషిపై కోపంగా ఉన్న తండ్రి