ఇన్నాళ్లకు కష్టానికి తగిన గుర్తింపు లభిస్తోంది.. Elli AvrRam
స్వీడిష్ బ్యూటీ ఎల్లీ అవ్రామ్ ఇన్నాళ్లకు తన కష్టానికి గుర్తింపు లభించినందుకు సంతోషంగా ఉందంటోంది.
దిశ, సినిమా : స్వీడిష్ బ్యూటీ ఎల్లీ అవ్రామ్ ఇన్నాళ్లకు తన కష్టానికి గుర్తింపు లభించినందుకు సంతోషంగా ఉందంటోంది. ఇటీవల అమితాబ్ బచ్చన్, నీనా గుప్తా, రష్మికతో కలిసి నటించిన బాలీవుడ్ చిత్రం 'గుడ్ బై' విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా ఓ సమావేశంలో పాల్గొన్న నటి తన నటనకు మంచి మార్కులు పడుతున్నాయని, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించినందకు హ్యాపీగా ఉందని తెలిపింది. అలాగే గత కొన్నేళ్లుగా తనకు లభిస్తున్న ఆదరణ పట్ల ఖుషీగా ఉన్నానని, ఇటీవల కాలంలో తన శక్తి సామర్థ్యాన్ని చిత్రనిర్మాతలు నిజంగా గుర్తి్స్తున్నట్లు వెల్లడించింది. దీంతో 'పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్' ఇస్తున్నారన్న హాటీ.. ఇందుకు దర్శకనిర్మాతలకు కృతజ్ఞురాలినని పేర్కొంది. చివరగా తన సినీ ప్రయాణం 'కేక్ వాక్' కాదన్న ఎల్లీ.. కేవలం టైప్కాస్ట్ లాంటి క్యారెక్టర్లు చేయడం ఇష్టంలేక ఎన్నో ఆఫర్లకు నో చెప్పాల్సి వచ్చిందని, ఎవరైనా సరే తనదైన రోజుకోసం ఓపిక పట్టాలని సూచించింది.