'XXX' సిరీస్‌లో బూతు పురాణం.. అయినా నిర్మాతకు..
బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ 'XXX' వెబ్ సిరీస్ అభ్యంతర కంటెంట్ విషయంలో పాట్నా హైకోర్టు నుంచి ఉపశమనం పొందింది. దీంతో ఆమె సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను విత్ డ్రా చేసుకుంది.. Latest Telugu News
దిశ, సినిమా : బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ 'XXX' వెబ్ సిరీస్ అభ్యంతర కంటెంట్ విషయంలో పాట్నా హైకోర్టు నుంచి ఉపశమనం పొందింది. దీంతో ఆమె సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను విత్ డ్రా చేసుకుంది. తన సొంత OTT ప్లాట్‌ఫారమ్ ALT బాలాజీలో ప్రసారమైన వెబ్ సిరీస్‌లో సైనికులను అవమానించినందుకు, వారి కుటుంబాల మనోభావాలను దెబ్బతీసినందుకు తనపై జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌ను సవాలు చేస్తూ ఆమె సుప్రీం కోర్టుకు వెళ్లింది. అయితే నిర్మాతలు ఏక్తా కపూర్, శోభా కపూర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోమని హైకోర్టు హామీ ఇవ్వకపోవడంతో ఆమె అరెస్ట్ నుంచి తక్షణ ఉపశమనం పొందగా పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. కాగా గత విచారణలో జస్టిస్ అజయ్ రస్తోగి, సిటి రవికుమార్‌లతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్.. 'మీరు ఈ దేశంలోని యువ తరం మనసును కలుషితం చేస్తున్నారు. ఈ కంటెంట్ OTTలో అందరికీ అందుబాటులో ఉంటుంది. మీరు ప్రజలకు ఎలాంటి ఎంపికను అందిస్తున్నారు?' అని ప్రశ్నించింది.
ఇవి కూడా చదవండి : జైలులో డ్యాన్స్ చేసిన రియా చక్రవర్తి..