వాళ్లంతా సెక్స్ సీన్‌ల మీదే ఆధారపడుతున్నారు.. నటి షాకింగ్ కామెంట్స్

ప్రజలకు వినోదం అందించడం కోసం దర్శకనిర్మాతలు ఇంటిమేట్ సన్నివేశాలపై ఫోకస్ చేయడం పూర్తిగా తప్పుడు ఆలోచన అంటోంది నటి ఏకావళి ఖన్నా.

Update: 2023-07-31 11:43 GMT

దిశ, సినిమా : ప్రజలకు వినోదం అందించడం కోసం దర్శకనిర్మాతలు ఇంటిమేట్ సన్నివేశాలపై ఫోకస్ చేయడం పూర్తిగా తప్పుడు ఆలోచన అంటోంది నటి ఏకావళి ఖన్నా. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్ ఇండియన్ పోలీస్ క్రైమ్ థ్రిల్లర్ ‘కొహ్రా’ అనే టెలివిజన్ సిరీస్‌తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె.. తాజా ఇంటర్వ్యూలో ఓటీటీ, సినిమా కంటెంట్‌లపై మాట్లాడింది. ‘ఇటీవల కొన్ని సినిమా, సిరీస్‌ల్లో కొన్నిసార్లు సన్నిహిత సన్నివేశం అవసరం లేకున్నా సందు చేసుకుని మరి క్రియేట్ చేస్తున్నారు. నిజానికి ఆడియన్స్‌ని అలరించేందుకు ఇంటిమేట్‌ సీన్స్‌ని వాడటం అవసరం లేదు. ఇది సరైనది కాదని నా అభిప్రాయం. స్క్రిప్ట్‌లో అవసరమైతే అది సెకన్లలో చూపించి చూపించనట్లు ఉండటమే బెటర్. లేదంటే ఆ కల్చర్ రోజు రోజుకు హద్దులు దాటుతూ సమజంపై తీవ్ర ప్రభావం వేస్తోంది’ అని చెప్పింది. అలాగే బోల్డ్ సన్నివేశం తన స్క్రిప్ట్‌లో ఉంటే దానికి ఎల్లప్పుడూ జస్టిఫికేషన్‌ను కోరుకుంటానని తన అభిప్రాయాలు వెల్లడించింది. 

Also Read: ఇండస్ట్రీలో ఎదగాలంటే వాళ్లతో డేటింగ్ చేయాలని చెప్పారు.. నోరా ఫతేహీ

Tags:    

Similar News