అలా చేయకపోతే నాన్న ఇంట్లోకి రానివ్వనన్నాడు.. దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్

మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌.. తన కుటుంబం, తండ్రి, సీనియర్‌ నటుడు మమ్ముట్టి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. గతేడాది ‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఆయన ప్రస్తుతం ‘కింగ్‌ ఆఫ్‌ కోటా’తోపాటు

Update: 2023-07-26 06:16 GMT

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌.. తన కుటుంబం, తండ్రి, సీనియర్‌ నటుడు మమ్ముట్టి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. గతేడాది ‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఆయన ప్రస్తుతం ‘కింగ్‌ ఆఫ్‌ కోటా’తోపాటు మరో మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నా సతీమణి అమల్‌ సూఫియాకు నా స్టార్‌డమ్‌ గురించి ఏ మాత్రం అవగాహన లేదు. ఓ సాధారణ ఇల్లాలిగానే ఉంటుంది. ఆమె దృష్టిలో నటన అంటే ఒక ఉద్యోగం లాంటిది. ఉదయాన్నే వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకుంటే చాలనుకుంటుంది. అంతకు మించి నా నుంచి ఏమీ ఆశించదు’ అని చెప్పాడు. అలాగే తండ్రి మమ్ముట్టి నటుడిగా తన విజయాల పట్ల సంతోషంగా ఉన్నారని, అయితే ఏడాదికి ఎక్కువ సినిమాలు చేయాలన్నది ఆయన కోరిక అని తెలిపారు. ‘నేను సంవత్సరానికి ఐదారు సినిమాలు చేసిన రోజులున్నాయి. నువ్వు ఏడాదికి రెండు సినిమాలు కూడా చేయట్లేదు. ఇలా అయితే ఇంకోసారి ఇంట్లోకి రానివ్వను. అని నాతో సీరియస్‌గా చెప్పారు’ అంటూ పలు విషయాలను గుర్తు చేసుకున్నాడు.

Read More:   విడాకుల వార్తలు.. నేనే అధికారిక ప్రకటన విడుదల చేస్తానంటూ కలర్ స్వాతి కామెంట్స్! 


Similar News