Rajamouli : రాజమౌళి గురించి అతిగా మాట్లాడకండి.. నెటిజన్లపై నటి ఫైర్
రాజమౌళి జోలికి రావద్దంటూ గట్టిగా క్లాస్ పీకారు.
దిశ, సినిమా: టాలీవుడ్ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తాజాగా ఓ మతం గురించి చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో జక్కన్న మాట్లాడుతూ.. తాను గతంలో గుళ్లూ, గోపురాలు తిరుగుతూ పూర్తి విశ్వాసంతో గడిపానని, ఆ తర్వాత క్రైస్తవ మతాన్ని అనుసరించి చర్చికి కూడా వెళ్లానని తెలిపాడు. అయితే తాను ఎదుర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో మతం అనేది ఒక దోపిడీ అనిపించింది అని రాజమౌళి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే జక్కన్న మాటలపై ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్లపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మండిపడ్డారు. రాజమౌళి జోలికి రావద్దంటూ గట్టిగా క్లాస్ పీకారు.
'ఓ హిందువునని చెప్పుకునేందుకు నేను గర్విస్తాను. రక రకాలుగా దాడులు చేసేవారికి, రెచ్చగొట్టే మాటలు, ట్రోలింగ్, తీవ్రస్థాయిలో ప్రతికూల భావాలు వ్యాపింపజేసే వారికి ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక్కటే. మేం అందరి కోసం సినిమా చేస్తాం. మా కళాకారులకు ఎన్నో రకాలు ప్రమాదాలు పొంచి ఉంటాయి. కానీ జాతీయవాదులుగా చెప్పుకునే వారి నుంచి మాకు ఎలాంటి మద్దతు లభించదు. దాంతో మాకు మేమే మద్దతు ఇచ్చుకుంటాం. అందుకే చెబుతున్నా.. రాజమౌళి సర్‌పై ఎలాంటి దాడినైనా సహించను. మౌనంగా ఉంటే మంచిది. రాజమౌళిగారు జోరున కురిసే వర్షంలో భగ భగ మండే అగ్నికీల వంటివారు. ఆయనొక మేధావి. జాతీయవాది. అత్యున్నతస్థాయి సినీ యోగి. అలాంటి వ్యక్తి చిత్ర పరిశ్రమలో ఉండడం ఓ దీవెన వంటిది' అని కంగన చెప్పుకొచ్చింది.
I know what controversy he did he loves this country and took regional cinema to the world, he is devotional/dedicated to the nation,that's his fault so they call him controversial but how dare this nation questions Shri Rajamouli ji's integrity as an individual,shame on you all
— Kangana Ranaut (@KanganaTeam) February 18, 2023