వామ్మో నాగచైతన్యకు ఇంత మందితో ఎఫైర్ ఉందా.. బయటపడ్డ లిస్ట్..?

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Update: 2023-08-03 09:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. నాగచైతన్యకు సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు. కానీ.. రూమర్స్ మాత్రం ఎక్కువగానే వినిపించాయి. చైతు, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తర్వాత పెళ్లైన కొన్నాళ్లకే ఇద్దరి మధ్య మరస్పర్థలు వచ్చి విడిపోయారు. అయితే.. సమంతతో మాత్రమే కాకుండా నాగచైతన్య లవ్ ఎఫైర్లు నడిపిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

2011 లో వచ్చిన ‘దడ’ సినిమాలో నాగచైతన్యకు జంటగా కాజల్ నటించింది. ఆ సమయంలో వీళ్ల ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తున్నట్లు వార్తలు వినింపిచాయి. అలాగే ప్రేమమ్ సినిమాలో శృతి హాసన్ ఓ కీలక రోల్ నటించినప్పుడు.. చైతన్య శృతితో కూడా ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి. కానీ వీటిపై ఎవరూ స్పందించలేదు. ఈ క్రమంలోనే వచ్చిన మరో సినిమా ‘మజిలి’. ఇందులో సమంతతో పాటు దివ్యాంశ కౌశిక్ కూడా నటించిన విషయం తెలిసిందే. ఆమెతో కూడా చైతు లవ్ ఎఫైర్ నడిపాడని ఈ కారణం చేతనే సమంతకు నాగచైతన్యకు మధ్య గొడవలు వచ్చాయని అప్పట్లో నెట్టింట రచ్చ రచ్చ జరిగింది.

ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా సమంతతో విడాకులు తీసుకున్నాక చైతు శోభిత ధూళిపాళ్లతో ఎఫైర్ పెట్టుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హాట్ హాట్‌గా వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై శోభిత స్పందించి.. మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పినప్పటికీ కూడా ఈ వార్తలకు ఇంకా బ్రేక్ పడలేదు. కాగా.. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, నాగ చైతన్య లవ్ ఎఫైర్స్ గురించి మరోసారి నెట్టింట న్యూస్ వైరల్ అవుతుంది.

Tags:    

Similar News