యాదమ్మ రాజు కాలి వేలు తీసేసిన డాక్టర్లు

జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో తన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు యాదమ్మ రాజు.

Update: 2023-08-02 09:11 GMT

దిశ, సినిమా: జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో తన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు యాదమ్మ రాజు. అయితే రీసెంట్‌గా ఆస్పత్రిలో బెడ్‌పై ఉన్న ఆయన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయన కాలుకు ఏమైందని రాజు ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. కాగా ఆ విషయంపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అసలు తనకి ఎలా యాక్సిడెంట్ అయిందో చెప్పుకొచ్చాడు యాదమ్మ రాజు. ‘టీ తాగడానికి బయటకు వెళ్లాను. అప్పుడు నాకు ఎదురుగా వచ్చిన బండి కంట్రోల్ తప్పి నా కాలు మీద నుంచి వెళ్లడంతో ఈ గాయం అయింది. హాస్పిటల్ వెళ్తే కుడి కాలుకు ఉన్న ఒక వేలుని ఆపరేషన్ చేసి తీసేశారు. తొడ దగ్గర కొంచెం చర్మం తీసి అక్కడ వేశారు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు’ అని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.

Tags:    

Similar News