బాలకృష్ణ తన అభిమానులను కొట్టడంలో అసలు రహస్యం తెలుసా?
నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పని లేదు. ఆయన తన మాటలతో ఓ ప్రత్యేక బ్రాండ్ సెట్ చేస్తుంటారు. అయితే
దిశ, వెబ్‌డెస్క్ : నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పని లేదు. ఆయన తన మాటలతో ఓ ప్రత్యేక బ్రాండ్ సెట్ చేస్తుంటారు. అయితే బాలయ్యకు సంబంధించిన ఓ రహస్యాన్ని అభిమానులతో పంచుకున్నారు రైటర్ సాయి మాధవ్ కొర్ర.
అయితే బాలయ్య ఎప్పుడూ తన అభిమానులపై చేయి చేసుకోవడం కామన్. చాలా మందిలో ఆయన తన ఫ్యాన్స్‌ను ఎందుకు కొడుతాడు అనే సందేహం కలుగుతుంది. కాగా దీనిపై రైటర్ సాయి మాధవ్ మాట్లాడుతూ.. హీరోలు ఎక్కడికైనా వెళ్తే తమ అభిమానులు పరిగెత్తుకు వస్తారు. తమ మీదే పడుతూ నానా హంగామా చేస్తారు. దీంతో హీరోలు కాస్త స్టార్డం రాగానే ఎక్కడికైనా బయటికి వెళ్లాలంటే వారి పక్కన బౌన్సర్లను నలుగురు ఐదుగురిని మెయింటైన్ చేస్తారు. కానీ బాలకృష్ణ మాత్రం అందుకు భిన్నంగా ఉంటారు.
తన అభిమానులను కొట్టడానికి వేరే వారికి డబ్బులు ఇచ్చి పెట్టాలా నా అభిమానులను నేను నా కుటుంబంగా భావిస్తాను అలాంటి వాళ్లని వేరే వారితో కొట్టించడం ఏంటి అని బాలకృష్ణ తన మీదకి వచ్చే అభిమానులపై తానే అప్పుడప్పుడు చేయి చేసుకుంటానని తెలిపారు. నా గురించి నా అభిమానులకు తెలుసు, వారి గురించి నాకు తెలుసు అంటూ బాలయ్య అంటారని తెలిపారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.