సొంత విమానం కలిగి ఉన్న తొలి సౌత్ ఇండియన్ హీరోయిన్ ఎవరో తెలుసా..? నయనతార మాత్రం కాదండోయ్

ప్రస్తుతం హీరోలతో పాటు హీరోయిన్లు కూడా ఏమాత్రం తగ్గకుండా భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ కోట్లకు కోట్లు వెనకేసుకుని లగ్జరీ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు.

Update: 2024-07-29 09:10 GMT

దిశ, సినిమా: ప్రస్తుతం హీరోలతో పాటు హీరోయిన్లు కూడా ఏమాత్రం తగ్గకుండా భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ కోట్లకు కోట్లు వెనకేసుకుని లగ్జరీ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. విలాసవంతమైన భవనాలతో పాటు లగ్జరీ కార్లు, బైకులు కొట్లలో ఖర్చు చేసి కొంటూ ఉంటారు. అలాగే కొంతమంది మాత్రం సొంత విమానాలు కూడా కొనుగోలు చేస్తారు. అలా కొన్న వారిలో ముఖ్యంగా మన సౌత్ ఇండియన్ స్టార్ హీరో హీరోయిన్లలో రామ్ చరణ్, నాగార్జున, ఎన్టీఆర్, నయనతార, రజనీకాంత్ , కమల్ హాసన్ వంటి చాలా మంది స్టార్స్‌కి సొంత విమానాలు ఉన్నాయి. మరి ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలి అంటే కచ్చితంగా వారు తమ ఫ్లైట్స్‌ని ఉపయోగిస్తారు.

ఈ క్రమంలోనే దక్షిణాది సినీ పరిశ్రమలో దాదాపు 45 ఏళ్ల క్రితమే ఒక హీరోయిన్ వెండితెరను ఏలి.. సొంతంగా విమానాన్ని కూడా కొనుగోలు చేసింది.. ఆమె మరెవరో కాదు కె.ఆర్ విజయ. అప్పట్లోనే ప్రైవేట్ జట్టును సొంతం చేసుకున్న తొలి సౌత్ ఇండియన్ నటిగా రికార్డ్ సృష్టించింది కే.ఆర్.విజయ. తమిళ నటి అయిన కే. ఆర్ విజయ 1970 లలో టాప్ హీరోయిన్‌గా పేరు సొంతం చేసుకుంది. అనతి కాలంలోనే బిజీ నటిగా మారిపోయి, ప్రతి ఏడాది పదికి పైగా సినిమాలను విడుదల చేసేది.

ఈమె ఒక తమిళ చిత్రాలలోనే కాదు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కూడా నటించి, దక్షిణాది స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది. అలా దాదాపు 500 కు పైగా చిత్రాల్లో నటించిన ఈమె.. అప్పట్లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ కూడా నిలవడం గమనార్హం. అంతే కాకుండా ఖరీదైన బంగ్లాలు, కోట్ల ఆస్తి ఈమె సొంతం. దీంతో ఒక ప్రైవేటు జెట్‌ను కూడా ఈమె కొనుగోలు చేసింది. అప్పుడప్పుడు ఆలస్యం అయితే తన సొంత విమానంలోనే కేఆర్ విజయ షూటింగ్‌కి వచ్చే వారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.


Tags:    

Similar News