పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. 15 ఏళ్లకే ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్న ఈ నటి ఎవరో తెలుసా..?
15 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయింది.
దిశ,వెబ్ డెస్క్: "దేవోన్ కే దేవ్ మహాదేవ్" సీరియల్‌లో పార్వతి పాత్రలో నటించి పాపులారిటీ సంపాదించుకున్న టీవీ నటి పూజా బెనర్జీ నిజ జీవితంలో అనేక ట్విస్ట్ లు ఉన్నాయి. ఈ ముద్దుగుమ్మ రెండు సార్లు పెళ్లి చేసుకున్న పూజా, చిన్న వయసులోనే ఇలాంటి నిర్ణయం తీసుకుందన్న కారణంతో కుటుంబానికి దూరంగా ఉంది. ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పూజా వెల్లడించింది.
పూజా బెనర్జీ 15 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయింది. అంతేకాదు పెళ్లికి ముందే గర్భం దాల్చింది. పూజా బెనర్జీ తన ప్రేమికుడు అరుణోయ్ చక్రవర్తితో 2004లో వివాహం చేసుకుంది. పెళ్లయిన కొన్నాళ్లకే వీరి బంధం చెడిపోవడం మొదలైంది. తర్వాత 2013లో పరస్పర అంగీకారంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. తన వివాహంపై పూజా మాట్లాడుతూ, "మేము బెంగాలీ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాము. మాకు పెళ్లవకముందే బిడ్డ ఉన్నప్పటికీ, మళ్లీ పెళ్లి చేసుకోవడం కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇది మా సంబంధంలో కొత్త తాజాదనాన్ని తెచ్చింది .అయితే, ఇంటి నుండి పారిపోయిపెద్ద తప్పు చేశానని" తన మాటల్లో చెప్పుకొచ్చింది.