మౌనికను పెళ్లి చేసుకుంటానన్న మనోజ్.. మోహన్ బాబు అడిగిన మొదటి ప్రశ్న ఏంటో తెలుసా?

మంచు మనోజ్, మౌనికలకు సంబంధించిన ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి వాటన్నింటికి చెక్ పెడుతూ వారు మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. అయితే వీరి పెళ్లి

Update: 2023-03-24 05:46 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మంచు మనోజ్, మౌనికలకు సంబంధించిన ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి వాటన్నింటికి చెక్ పెడుతూ వారు మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. అయితే వీరి పెళ్లి తర్వాత కూడా రూమర్స్ కు ఏ మాత్రం బ్రేక్ పడలేదు. మోహన్ బాబుకు వీరు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటూ ఎన్నో వార్తలు నెట్టింట్లో చెక్కర్లు కొట్టాయి.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ బాబు మా ఫ్యామిలీ పై లేనిపోనివి క్రియేట్ చేసే వాళ్ళందరూ కుక్కలు అని మొరిగే కుక్కలను అస్సలు పట్టించుకోకూడదు అని గట్టిగా మాట్లాడారు.

అయితే ఆయన మాట్లాడుతూ, మనోజ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నాడు.మోహన్ బాబు దగ్గరికి మంచు మనోజ్ వచ్చి నాన్న నేను మౌనికను పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను అని నాతో చెప్పాడు, నేను దానికి సమాధానం ఇస్తూ మరోసారి ఆలోచించు అన్నాను. కానీ దానికి మనోజ్ మాట్లాడుతూ లేదు నాన్న నేను ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పడంతో, ఓకే సరే నీ మాటని మేము ఎందుకు కాదంటం బెస్ట్ ఆఫ్ లక్ చేసుకో అన్నానంటూ తెలిపానన్నాడు.

Read more:

ప్రభాస్‌పై అనుష్క ఆగ్రహం.. కలిసి నటించకూడదని నిర్ణయం?

Tags:    

Similar News