స్నేహమంటే ఇదే.. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం త్రివిక్రమ్ ఏం చేస్తున్నాడో తెలుసా?

ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం పిఠాపురం వైపే చూస్తుంది. అక్కడ తమ అభిమానన నటుడు గెలవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అంతే కాకుండా మెగా ఫ్యామిలీ, తెలుగు నటీనటులు కొందరు పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్‌గా పిఠాపురం వెళ్లి

Update: 2024-05-13 03:28 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం పిఠాపురం వైపే చూస్తుంది. అక్కడ తమ అభిమానన నటుడు గెలవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అంతే కాకుండా మెగా ఫ్యామిలీ, తెలుగు నటీనటులు కొందరు పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్‌గా పిఠాపురం వెళ్లి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ కోసం తివిక్రమ్ చాలా గొప్పపని చేస్తున్నాడంట.

పవన్, త్రివిక్రమ్ ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరు ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడమే కాకుండా ఒకరి సలహాలను ఒకరు పాటిస్తూ, విధివిధానాలను గౌరవించుకుంటారు. అయితే ప్రస్తుతం ఏపీలో ఎన్నిలు జరుగుతున్న విషయం తెలిసిందే. పిఠాపురం నియోజక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. కాగా, ఆయన ఆ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవాలని, ఆయన తమ కులదైవం గుడిలో ప్రత్యేక పూజలు జరిపించాడంట. పవన్ బాగుండాలని, తాను ఏం కోరుకుంటున్నాడో ఆ కోరిక నెరవేరాలని త్రివిక్రమ్ గుడిలో పూజలు చేశారంట. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీరి కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది లాంటి సినిమాలు ఎంత పెద్ద హిట్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక పవన్ కోసం త్రివిక్రమ్ చేస్తున్న పని చూసి ఆయన అభిమానులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్నేహం అంటే అలా ఉండాలి అంటూ దర్శకుడిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.


Similar News