Samantha Ruth Prabhu : సమంత ధరించిన ఆ మెలికల వాచ్ ధర ఎంతో తెలుసా..?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటీస్ నుంచి కోలుకుంటున్న విషయం తెలిసిందే.
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటీస్ నుంచి కోలుకుంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా దాదాపు సంవత్సరం పాటు సినిమాలకు దూరం అయిన ఈ బ్యూటీ.. మళ్లీ సెకండ్ ఇన్సింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. హెల్త్‌కు సంబంధించిన పలు వీడియోలను అభిమానులతో పంచుకుంటోంది.
అంతే కాకుండా.. ఈ మధ్య గ్లామర్ డోస్ మరింత పెంచేసిన ఈ అమ్మడు ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్‌తో దర్శనమిస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక తాజాగా బ్లాక్ బ్లేజర్ ధరించి చేసిన ఫొటో షూట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. అందులో గ్లామర్‌కు హద్దులు చెరిపేస్తూ ఇచ్చిన ఫొజోలకు కుర్రాళ్ల మైస్మరైజ్ అవుతున్నారు. ఈ క్రమంలోనే మరోసారి స్టన్నింగ్ లుక్‌తో కట్టి పడేసింది సామ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో సమంత అందాన్ని డామినేట్ చేసే విధంగా మరో విషయాన్ని గుర్తించారు ఫ్యాన్స్.
అదేంటంటే.. సమంత చేతి వాచ్. అవును ఈ మధ్య కాలంలో చేసిన రెండు ఫొటో షూట్‌లలో ఆ వాచ్‌నే ధరించింది సామ్ బేబి. దీంతో మెలికలు తిరిగిన వాచ్ గురించి సెర్చ్ చెయ్యడం స్టార్ట్ చేశారు నెటిజన్లు. ఈ క్రమంలోనే వైలర్ అవుతున్న సమాచారం మేరకు సమంత ధరించిన వాచ్ బల్గేరి సర్పెంటా అనే ఇటాలియన్ బ్రాండ్‌కి సంబందించినది. ఆ వాచ్ ధర అక్షరాలా రూ. 70 లక్షలు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. కాగా.. సమంత ప్రస్తుతం ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌తో బిజీగా ఉంది.
Read More...