Bhagavanth Kesari : మూవీ తెలుగు స్టేట్స్ లో ఎన్ని కోట్లు బిజినెస్ చేసిందో తెలుసా?

బాలయ్య ఇప్పుడు హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడితో చేస్తున్న “భగవంత్ కేసరి” సినిమా చేస్తున్నాడు.

Update: 2023-08-19 09:15 GMT

దిశ,వెబ్ డెస్క్: టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి బాలయ్య అఖండ, వీర సింహా రెడ్డి లాంటి భారీ హిట్స్ సినిమాలతో మళ్ళీ తన మాస్ కం బ్యాక్ ఇచ్చి ట్రాక్ లోకి రావడానికి బాలయ్య అదే ఫామ్ లో ఉన్నాడు.అయితే బాలయ్య ఇప్పుడు హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడితో చేస్తున్న “భగవంత్ కేసరి” సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమాని అనీల్ రావిపూడి పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తుండగా భారీ హైప్ ఇప్పుడు సినీ వర్గాల్లో నెలకొంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ చేసిందని తెలుస్తుంది. సినీ వర్గాల్లో వస్తున్న సమాచారం ప్రకారం రూ. 60 కోట్లకి పైగా బిజినస్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. 

Read More:   జైలర్ దెబ్బకు కోట్లకు ఎగబాకిన అనిరుధ్!

Tags:    

Similar News