Devara: Part 1: దేవర కోసం ఎన్టీఆర్ ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా?

దేవర కోసం ఎన్టీఆర్ ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా

Update: 2024-09-16 03:29 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఇప్పుడు ఎక్కడా చూసిన దేవర మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ మూవీ రోజుకో రికార్డు బద్దలు కొడుతూ..సంచనాలను సృష్టిస్తుంది. ట్రైలర్ రిలీజ్ అయినా దగ్గర నుంచి  ఈ మూవీ పై అంచనాలు భారీగా పెరిగాయి. ట్రైలర్ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ రెమ్యునరేషన్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం ..

ప్రస్తుతం ఈ మూవీ గురించే చర్చ నడుస్తుంది . సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ కోసం తారక్ అభిమానులతో పాటుగా సగటు సినీ ఇండస్ట్రీ మొత్తం ఎంతోగానో వేచి చూస్తున్నారు. ఇక దేవర సినిమాకి సంబంధించి రోజుకో వార్త హల్చల్ చేస్తుంది. దేవర సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా రూ. 60 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆర్ఆర్ఆర్ మూవీకి రూ. 45 కోట్లు తీసుకున్నట్లు వార్తలు వైరల్ గా మారాయి. అంటే .. ఎన్టీఆర్ పారితోషికం 33 శాతం పెరిగింది. ఇక దీనిలో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది. ఈ మూవీతో  తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ రూ. 5 కోట్ల పారితోషికం అందుకుంది.

Tags:    

Similar News