బాలకృష్ణకు బాలయ్య అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్య భరితమైన పాత్రలను చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.

Update: 2023-06-16 13:56 GMT

దిశ, వెబ్‌డెస్క్ : నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్య భరితమైన పాత్రలను చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.

ఇక ఈయన ఇప్పటికీ వరస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. అంతే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటున్నారు. అయితే బాలకృష్ణను తమ అభిమానులు బాలయ్య అని పిలుస్తుంటారు. కాగా, ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందనేది చాలా మందికి తెలియదు. అందువలన బాలయ్య అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

బాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్ బి గోపాల్ కాంబినేషన్‌లో ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి. అందులో లారీ డ్రైవర్ మూవీ ఒకటి. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ సాధించింది. ఇక ఈ సినిమాలో పాటలు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సిరివెన్నెల రాశారు. అయితే డైరెక్ట‌ర్ బి.గోపాల్ ముందే మీరు ఏమైనా రాసుకోండి.. కానీ పాట‌లో `జై బాల‌య్య` అని రావాల‌ని చెప్పార‌ట‌. దాంతో జొన్న‌విత్తుల `బాలయ్య బాలయ్య.. గుండెల్లో గోల‌య్యా` అనే సాంగ్ రాశారు. ఈ సాంగ్ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. ఇక అప్ప‌టి నుంచే ఫ్యాన్స్ అంద‌రూ బాల‌కృష్ణ‌ను బాల‌య్య అని పిల‌వ‌డం ప్రారంభించారు. అలాగే బాల‌కృష్ణ‌ను బాల‌య్య అనే పేరు వ‌చ్చింది.

ఇవి కూడా చదవండి: హనుమంతుడిని బాలయ్య కానీ పూనాడా ఏంటి? ఆ డైలాగ్ ఏంట్రా బాబు!

Tags:    

Similar News